Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా ఏడో ఓవర్ వెనుక ఎవరున్నారో తెలుసా?: కోహ్లీ

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో కోహ్లీసేన 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్ ఆర్డర్‌లో చేసిన మార్పు కూడా భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించడంతో ఒక్కో బౌలర్‌కు రెండు ఓవర్లు వేసే వెసులుబాటుని మాత్రమే అంఫైర్లు కల్పించారు. దీంతో భువనేశ్వర్ కుమార్ తన రెండు ఓవర్ల కోటాను ముందే వినియోగించుకున్నాడు.

దీంతో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆఖరి ఓవర్ వేస్తాడని అందరూ భావించారు. అయితే కోహ్లీ అనూహ్యంగా ఏడో ఓవర్‌ని బుమ్రా చేత వేయించాడు. ఈ వ్యూహం ఫలించింది. రెండు ఓవర్లలో కివీస్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే బుమ్రా నికోలస్‌ను ఔట్ చేశాడు.

ఈ ఓవర్‌లో పది పరుగులు రాబట్టిన కివీస్ చివరి బంతికి మరో వికెట్ కోల్పోయింది. బ్రూస్‌ను ధోని, హార్దిక్ పాండ్యా అద్భుతమైన రనౌట్ చేశారు. దీంతో చివరి ఓవర్‌కు ముందు న్యూజిలాండ్ ఒత్తిడికి లోనైంది. బుమ్రాతో ఏడో ఓవర్ వేయించాలనే ఆలోచన రోహిత్ శర్మ, ధోనీదేనని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపాడు.

అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం

అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం

'చివరి ఓవర్లో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉంటే కివీస్ గెలుపు కష్టం అవుతుందని భావించాం. అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం. పాండ్యా ఆఖరి ఓవర్ వేశాడు' అని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. మరోవైపు పాండ్యా వేసిన చివరి ఓవర్ తనను టెన్షన్‌కు గురి చేసిందని కూడా కోహ్లీ చెప్పాడు.

 చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు

చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు

ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్‌ కోహ్లీ బంతిని పాండ్యాకు అప్పగించాడు. మొదటి బంతి స్లో బంతిగా పాండ్యా చివరి ఓవర్‌ను ప్రారంభించాడు. మొదటి బంతికి బై రూపంలో పరుగు కోసం ప్రయత్నించిన మిచెల్‌ శాంట్నర్ ఔట్‌ అవ్వడం అభిమానులు ఆనందంలో మునిగారు.

 పాండ్యా చేతివేలికి గాయం

పాండ్యా చేతివేలికి గాయం

ఇక, రెండో బంతి తర్వాత మైదానంలో డ్రా చోటు చేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్‌ బ్యాట్స్‌మన్‌ కలిన్‌ డీ గ్రాండ్‌హామ్‌ స్ట్రయిట్‌ షాట్‌ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బంతిని క్యాచ్‌ పట్టుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.

 చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పాండ్యా

చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పాండ్యా

వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌ మైదానంలోకి వచ్చి పాండ్యాకు ప్రాధమిక చికిత్స చేశాడు. దీంతో ఫిట్‌ అయిన పాండ్యా చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్‌హోమ్‌ భారీ సిక్సర్‌ కొట్టినప్పటికీ... ఆ తర్వాతి బంతులను పాండ్యా కట్టుదిట్టంగా వేయడంతో భారత్ విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+