CSK vs KKR: త్రీ టైమ్ చాంపియన్ X టూ టైమ్ విన్నర్.. ఇరు జట్ల ఫైనల్ రికార్డ్స్ ఇవే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్దమైంది. పేలవ ప్రదర్శనతో గతేడాది లీగ్ దశలోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. అద్భుత విజయాలతో ఈ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో దారుణంగా విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈ గడ్డపై అన్యూహ విజయాలతో టైటిల్‌పోరుకు అర్హత సాధించింది. కీలక ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌ల్లో తమ కంటే పటిష్టమైన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించిన కేకేఆర్.. రెట్టించిన ఉత్సాహంతో తుది పోరుకు సిద్దమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య దసరా పర్వదినాన దుబాయ్ వేదికగా జరిగే టైటిల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. మరోవైపు ఈ సీజన్‌లో లీగ్‌దశలో ఆడిన 14 మ్యాచుల్లో 9 గెలిచిన చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీఎల్​లో తొమ్మిదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ధోనీకి ఘన వీడ్కోలు దక్కనుందా?

ధోనీకి ఘన వీడ్కోలు దక్కనుందా?

ధోనీ కెప్టెన్నీ ఆ జట్టుకు కొండంత బలం కాగా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ కలిసిరానుంది. టీమ్ కూర్పు విషయంలో ధోనీ వ్యూహాలు ఫలితాలనిస్తున్నాయి. నిలకడలేమి ఆటతో తంటాలు పడుతున్న స్టార్​ బ్యాటర్ సురేశ్‌ రైనా స్థానంలో.. ఉతప్పను తొలి క్వాలిఫయర్‌ తుదిజట్టులోకి తీసుకుని ధోనీ ఫలితం రాబట్టాడు. బ్రావో, డుప్లెసిస్, రాయుడు, ఉతప్ప, మొయిన్ అలీ, జడేజా వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది.

జోష్ హజెల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లతో కూడిన బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. అయితే.. కోల్​కతా స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురి స్పిన్ ఉచ్చులో చిక్కుకునే ఆర్‌సీబీ, ఢిల్లీ విలవిలలాడాయి.

 స్పిన్ త్రయమే..

స్పిన్ త్రయమే..

ఈ సీజన్‌లో భాగంగా భారత్‌ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచిన కోల్‌కతా.. సెకండాఫ్‌లో అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు రాబట్టింది. స్పిన్‌ త్రయం.. వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్‌లు యూఏఈ పిచ్‌లపై చెలరేగుతున్నారు. ముగ్గురు కట్టడిగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక సెకండాఫ్‌లో తుది జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడిగా మారాడు. అతనికి తోడు శుభ్‌మన్ గిల్ కూడా రాణిస్తున్నాడు.

రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా పర్వాలేదనిపిస్తున్నా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్‌ ఆ జట్టును కలవరపెడుతుంది. టాప్-4 విఫలమైతే.. కోల్‌కతా ఇన్నింగ్స్ పేక మేడల్లా కూలుతుంది. ఈ సమస్యను అధిగమించాల్సి అవసరం ఆ జట్టుకు ఉంది. ఇక గాయపడ్డ రసెల్​ స్థానంలో జట్టులోకి వచ్చిన షకీబ్‌ జట్టుకు సమతూకం తెస్తున్నాడు. పేసర్లు ఫెర్గూసన్, శివం మావి పర్వాలేదనిపిస్తున్నారు.

 చెన్నైకి ఫైనల్ ఫీవర్..

చెన్నైకి ఫైనల్ ఫీవర్..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 8 సార్లు ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు ఓడిపోగా.. కోల్​కతా నైట్​రైడర్స్​ మాత్రం ఫైనల్‌కు చేరిన రెండుసార్లు కప్‌ నెగ్గింది. ఈ క్రమంలోనే రేపటి తుది పోరులో కేకేఆర్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే డాడీస్ ఆర్మీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 సీజన్లలో టైటిల్ గెలవగా..2008, 2012, 2013, 2015, 2019 సీజన్లలో ఫైనల్లో ఓడి రన్నరప్‌‌గా నిలిచింది. ఇక 2012 ఫైనల్లో సీఎస్‌కేపై కేకేఆర్ విజయం సాధించింది. 2014లో మాత్రం పంజాబ్ కింగ్స్‌పై గెలిచి రెండో సారి టైటిల్ అందుకుంది.

 సీఎస్‌కే టైటిల్స్ లిస్ట్

సీఎస్‌కే టైటిల్స్ లిస్ట్

1. 2010- ఐపీఎల్

2.2010- చాంపియన్స్ లీగ్ టీ20

3. 2011- ఐపీఎల్

4. 2014- చాంపియన్స్ లీగ్

5. 2018-ఐపీఎల్

కేకేఆర్ టైటిల్స్ లిస్ట్

1. 2012 ఐపీఎల్

2. 2014 ఐపీఎల్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 14, 2021, 18:52 [IST]
Other articles published on Oct 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X