
సెంచరీలు చేసినా..
ఇన్ని దేశాల్లో సెంచరీలు చేసినా కూడా ఆ తర్వాతి మ్యాచుల్లో రాహుల్ రాణించలేదు. అందుకే 47 మ్యాచుల తర్వాత కూడా అతని సగటు 34 మాత్రమే ఉంది. ఇదే వరుసలో ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీసులో కూడా రాహుల్ పేలవంగా ఆడుతున్నాడు. అతను ఇలా చెత్త ఫామ్‌లో ఉండటం ఇదేం తొలిసారి కాదు. 2018లో ఇంగ్లండ్ పర్యటనలో కూడా తొలి నాలుగు టెస్టుల్లో కూడా ఘోరంగా ఫెయిలయ్యాడీ కర్ణాటక బ్యాటర్. అయినా కోహ్లీ అతనిపై నమ్మకం ఉంచి ఐదో టెస్టులో ఆడిస్తే ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు.

కుర్రాడేం కాదుగా..
కానీ అప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో మురళీ విజయ్, శిఖర్ ధవన్ ఫామ్ కోల్పోయారు. మయాంక్ అగర్వాల్ ఇంకా రంజీల్లో దుమ్ములేపలేదు. పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ చాలా చిన్న వాళ్లు. అసలు రాహులే కొత్త కుర్రాడు. అందుకని అతనికి బ్యాకింగ్ ఇవ్వడం ఓకే. కానీ ఇప్పుడు రాహుల్ ఒక సీనియర్ ప్లేయర్ కదా. అతనికి అవకాశాలు ఇస్తూ.. తమకు ఛాన్స్ కోసం తలుపులు బద్దలు కొడుతున్న గిల్, పృథ్వీ షా వంటి వారిని ఎంత కాలం పట్టించుకోకుండా వదిలేస్తారు? అని రవిశాస్త్రి థింక్ ట్యాంక్‌లో సభ్యుడు, టీం మేనేజర్‌గా పనిచేసిన సునీల్ సుబ్రమణ్యన్ అన్నాడు.

పరిస్థితులు పూర్తిగా భిన్నం!
'అప్పట్లో శుభ్‌మన్ గిల్‌లా ఛాన్స్ కోసం తలుపులు బద్దలు కొడుతున్న ఆటగాళ్లు లేరు. ఇప్పుడు పృథ్వీ షా కూడా ఉన్నాడు. ఇలాంటి సత్తా ఉన్న వాళ్లను ఇంకెంత కాలం వదిలేస్తారు?' అని సునీల్ నిలదీశాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో కూడా రాహుల్‌నే టీమిండియా ఆడిస్తుందా? లేక గిల్‌కు ఛాన్స్ ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. గిల్‌ను ఆడిస్తారని పలువురు మాజీలు అంటున్నారు కానీ.. రోహిత్ కానీ, ద్రావిడ్ కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. దీంతో రాహుల్‌కు మరో అవకాశం ఇస్తారేమో? అని అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications
