హరారే: జింబాబ్వే పైన తొలి ట్వంటీ 20లో ఓడిన భారత్, రెండో మ్యాచులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చింది. పసికూనలా భావించే జింబాబ్వే పైన తొలి మ్యాచులో ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లలో, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఆ పరాజయం యువ ఆటగాళ్లను నిరుత్సాహానికి గురి చేసింది. ఇంతటి నిరుత్సాహంలోను భారత్ రెండో మ్యాచులో తిరిగి పుంజుకుంది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో, టీమిండియా సంబరాలకు అంతులేకుండా పోయింది.

అయితే, తొలి ఓటమి అనంతరం.. రెండో మ్యాచులో గెలుపుకు ఓ హాలీవుడ్ సినిమా కారణమట. ఆ సినిమాతో వచ్చిన రిలాక్స్, నూతనోత్సాహంతోనే రెండో మ్యాచులో గెలిచారంటున్నారు.
వికెట్ పోకుండా ధోనీసేన ప్రతీకారం: జింబాబ్వేని చితక్కొట్టారు
ట్వంటీ 20 తర్వాత ఒత్తిడికి గురయ్యామని, ఆ ఓటమి షాక్ నుంచి బయటపడేందుకు.. అదే పిచజ్ పైన చాలా మ్యాచులు ఆడామని, ఓటమి పైన కొన్ని కీలక విషయాలు చర్చించిన అనంతరం హాలీవుడ్ మూవీ 'నౌ యు సీ మీ-2' సినిమాకు వెళ్లామని, ఆ సినిమాను ధోనీతో పాటు కొంతమంది క్రికెటర్లం కలిసి చూశామని, ఒత్తిడిలో ఉన్న తమకు ఆ సినిమా ఉపశమనం కలిగించిందని టీమిండియా యువ ఆటగాడు మన్‌దీప్ సింగ్ చెప్పాడు.
మూడో ట్వంటీ 20పై భారత్-జింబాబ్వే కన్ను
మూడో ట్వంటీ 20 పైన భారత్, జింబాబ్వేలు దృష్టి సారించాయి. తొలి మ్యాచులో జింబాబ్వే గెలిచింది. రెండో మ్యాచులో భారత్ గెలిచింది. తద్వారా సిరీస్ సమం అయింది. దీంతో, మూడో మ్యాచు పైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలిస్తే వారిదే సిరీస్.