India vs Australia: హైదరాబాద్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసానికి కుల్దీప్ చెక్ పెడతాడా?


హైదరాబాద్: గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీమిండియాతో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. గతంలో యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు తెగ ఇబ్బంది పడిన మాక్స్‌వెల్.. బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో పరుగుల సునామీ సృష్టించాడు.
రెండో టీ20లో 113 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరిస్' అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అంతకముందు 2017లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్ కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు.

మాక్స్‌వెల్‌ను ఔట్ చేసింది చాహలే
దీంతో ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి మ్యాక్స్‌వెల్‌ను తప్పించారు. ఈ మూడు మ్యాచుల్లోనూ మాక్స్‌వెల్‌ను ఔట్ చేసింది చాహలే. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్ వికెట్ చాహలే తీశాడు. ఆఖరికి ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన తొలి టీ20లోనూ మాక్స్‌వెల్ వికెట్ చాహలే పడగొట్టాడు. టీ20లు, వన్డేలు, ఐపీఎల్ మ్యాచుల్లో కలుపుకుని ఇప్పటి వరకు మాక్స్‌వెల్‌ను చాహల్ 8 సార్లు ఔట్ చేశాడు.

చాహల్ బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదిన మాక్స్‌వెల్
ఆస్ట్రేలియాపై 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన చాహల్.. ప్రతి రెండు మ్యాచ్‌లకు ఒకసారి చొప్పున మాక్స్‌వెల్‌ను ఔట్ చేయడం విశేషం. మ్యాక్స్‌వెల్‌పై అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్న చాహల్ ఫిబ్రవరి 27న జరిగిన రెండో టీ20లో విఫలమయ్యాడు. చాహల్ బౌలింగ్‌పై పరుగుల వరద పారించాడు. చాహల్ వేసిన 16వ ఓవర్‌లో మాక్స్‌వెల్ కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

కుల్దీప్ యాదవ్‌కు కూడా మంచి రికార్డే
ఇక, ఇప్పుడు కుల్దీప్ యాదవ్ వంతు వచ్చింది. ఆస్ట్రేలియాపై కుల్దీప్ యాదవ్‌కు కూడా మంచి రికార్డే ఉంది. 2017లో భారత్‌లో జరిగిన 4 టెస్టుల సిరీస్‌లో కుల్దీప్ రాణించాడు. ధర్మశాల టెస్టులో మాక్స్‌వెల్‌ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో హైదరాబాద్ వన్డేలో మ్యాక్స్‌వెల్‌పై కుల్దీప్ యాదవ్‌ను ప్రయోగించాలని టీమిండియా భావిస్తోంది. కోహ్లీ సైతం ఇదే నిర్ణయంతో ఉన్నాడు.

మ్యాక్స్‌వెల్ స్థానంపై ఫించ్ మాట్లాడుతూ
హైదరాబాద్ వన్డేలో మాక్స్‌వెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపాలని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. మ్యాక్స్‌వెల్ స్థానంపై ఫించ్ మాట్లాడుతూ "భారత జట్టు ఆసీస్ పర్యటనకు వచ్చినప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏడో నెంబర్‌లో బరిలోకి దిగాడు. అయితే ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో అతడి స్థానాన్ని మారుస్తాం. కచ్చితంగా ఎక్కడ ఆడతాడనేది చెప్పలేను కానీ మ్యాక్స్ ఫామ్ అద్భుతంగా ఉంది" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications