హైదరాబాద్: చెన్నై టెస్టు మ్యాచ్ ముందుకు టీమిండియా మిడల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌కు వింత అనుభవం ఎదురైంది. చెన్నై టెస్టుకు ముందు కరుణ్ నాయర్ టీ పెట్టడానికి చెన్నైకి వస్తున్నాడంటూ ట్విట్టర్‌లో తమిళనాడు క్రికెట్ అభిమానులు సెటైర్లు వేశారు.
చెన్నై టెస్టుకు ముందు సోషల్ మీడియాలో నాయర్‌పై ఛాయ్-షాప్ జోక్స్ బాగానే వచ్చాయి. ఇంగ్లాండ్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ మొహాలీలో జరిగిన మూడో టెస్టులో 3, ముంబైలలో జరిగిన నాలుగో టెస్టులో 13పరుగులతో ఆశించిన మేరకు రాణించని విషయం తెలిసిందే.
దీంతో చెన్నై టెస్టుకు ముందు కరుణ్ నాయర్‌ను ఆటపట్టిస్తూ ట్విట్టర్‌లో పలు రకాల జోక్స్ దర్శనమిచ్చాయి. అయితే చెన్నై టెస్టు తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అయితే నాయర్‌పై సోషల్ మీడియాలో నాయర్ పై జోక్స్ వేసుకోవడంపై అతని కోచ్ బి శివానందా అసంతృప్తి వ్య్తక్తం చేశాడు.

'నాయర్ కేవలం టీ అమ్మడానికి చెన్నై వస్తున్నాడా?, టీ షాపు అతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది' అంటూ నెటిజన్లు జోక్స్ వేసుకున్నారు. అయితే ఆ విమర్శలకు నాయర్ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అతను ఆడిన తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడమే నాయర్ పై జోక్‌లకు బీజం వేసిందని అన్నాడు.
అంతేకాదు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నాయర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసి తమిళ నెటిజన్ల సెటైర్లను తిప్పికొట్టాడు. ఎక్కడైనా వైఫల్యం అనేది ఉంటుందనేది గ్రహిస్తే మంచిదంటూ చురకలు వేశాడు. ఈ తరహా కామెంట్లు ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించాడు.
ఇలా జోక్స్ వేసుకోవడం వల్ల ఆయా ప్రజల మైండ్ సెట్‌ను బయటపెడుతుందే తప్ప ఇంకేమి కలిసిరాదని అన్నాడు. చెన్నై టెస్టులో 381 బంతులు ఎదుర్కొన్న నాయర్ 32 ఫోర్లు, 4 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నాయర్ చరిత్ర సృష్టించాడు.