For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వార్త తెలిసి మా అత్తయ్య తెగ ఉప్పొంగిపోయింది : బుమ్రా భార్య సంజనా గణేషన్

 How Jasprit Bumrah Family Reacted After He appointed as a Test Captain Of India

ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్‌కు జట్టు కెప్టెన్ ఎవరా అనే విషయంలో ఉత్కంఠ వీడింది. జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. 1987లో కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఇక భారత టెస్ట్ జట్టు 36వ కెప్టెన్‌గా కూడా బుమ్రా నిలిచాడు. ఇక బుమ్రా భార్య సంజనా గణేశన్‌.. బుమ్రా కెప్టెన్‌గా అవ్వడంతో అతని కుటుంబం ఎలా స్పందించిందో తెలియజేసింది. వార్మప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మకు కోవిడ్ -19 సోకడంతో రోహిత్ అయిదో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో సైతం అతనికి పాజిటివే రావడంతో ఇక అతన్ని చివరి టెస్ట్ నుంచి తప్పించక తప్పలేదు. ఇక బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కడంపై బుమ్రా తల్లి చాలా ఆనందం వ్యక్తం చేశారని సంజనా గణేషన్ తెలిపింది. అలాగే టెస్ట్ కెప్టెన్‌కి కొన్ని చిట్కాలు, ఉపాయాలను కూడా సూచించిందటా. 'అత్తయ్య చాలా ఉత్సాహపడ్డారు. బుమ్రా క్రికెట్లో రాణించడాన్ని ఆమె ఎప్పుడూ ఇష్టపడుతుంది. బుమ్రా ఈ స్థాయికి చేరడానికి ఎంత కష్టపడ్డాడో అతని క్రికెట్ ప్రయాణాన్ని మొత్తం ఆమె చూసింది. ఇక భారత్ టెస్ట్ కెప్టెన్‌గా బుమ్రాను ప్రకటించిన విషయం తెలియగానే ఆమె ఉప్పొంగిపోయింది. ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడనప్పటికీ.. ఆమె వద్ద ఎన్నో చిట్కాలు, ట్రిక్స్ ఉన్నాయి. ఒక తల్లిగా నిరంతరం అతన్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉంటుంది.' అని సంజనా గణేశన్ ఐసీసీ ప్రతినిధులతో పేర్కొన్నారు. తన భర్త టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడాన్ని బుమ్రా భార్య సంజనా గణేషన్ కూడా చాలా హ్యాపీగా ఫీలయింది. ఈ విషయాన్ని అతను గ్రహించడానికి తొలుత కాస్త టెన్షన్ పడి ఉంటాడనుకుంటున్నా. కానీ అతనికి ఈ విషయాన్ని ఆవాహన చేసుకోవడానికి తగినంత టైం దొరికింది. అతని పట్ల చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.' అని గణేశన్ జోడించారు.

Story first published: Friday, July 1, 2022, 13:12 [IST]
Other articles published on Jul 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+