Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022 : పాక్ చేతిలో ఓటమి అనంతరం భారత్ ఫైనల్ చేరడమెలా..? ఆ ఒక్కటి చాలా కీలకం

How India Will Reach Asia Cup Final Match, These are the Key things that India should Maintain

ఆసియా కప్‌-2022లో టీమిండియా‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 స్టేజ్ మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఇండియాకు ఓ ముప్పు ఏర్పడింది. ఫైనల్ చేరడానికి కొంత సంక్లిష్ఠత ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఉన్న టీమిండియా ఫామ్ మేరకు ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం టీమిండియా తప్పకుండా మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఆసియా కప్ టోర్నీలో సూపర్ 4 స్టేజ్ గట్టెక్కడానికి గల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

అసలు సూపర్ 4 ఫార్మాట్ ఎలా ఉంటుంది?

అసలు సూపర్ 4 ఫార్మాట్ ఎలా ఉంటుంది?

ఆసియాకప్ సూపర్ 4 స్టేజులో నాలుగు జట్లు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. సూపర్ 4దశలో ప్రతి జట్టు మరో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే ప్రతి జట్టు ఈ దశలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తంగా ఈ స్టేజులో ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ స్టేజు మ్యాచ్‌లు ఒక్కటి మినహా మిగితావన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయి.

ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లు అయిపోయాయి. సెప్టెంబర్ 3న ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందగా.. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది. ఇకపోతే మిగిలిన నాలుగు మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 6న ఇండియా వర్సెస్ శ్రీలంక, సెప్టెంబర్ 7న పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, సెప్టెంబర్ 8న ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, సెప్టెంబర్ 9న శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఫైనలిస్టులను ఎలా నిర్ణయిస్తారు?

ఫైనలిస్టులను ఎలా నిర్ణయిస్తారు?

ఒక జట్టు సూపర్ 4పోరులో గెలిచిన ప్రతిసారీ 2పాయింట్లు క్రెడిట్ అవుతాయి. సూపర్ 4 దశ తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన రెండు జట్లు ఆసియా కప్ 2022 ఫైనల్లో తలపడతాయి. ఉదాహరణకు ఒక జట్టు 6పాయింట్లు మరో జట్టు 4పాయింట్లు, మిగతా రెండు జట్లు చెరో 2 పాయింట్లు సాధించాయనుకో.. 6పాయింట్లు, 4పాయింట్లు సాధించిన జట్లు ఫైనల్లో తలపడతాయి. సెప్టెంబర్ 11న ఆదివారం రాత్రి 7.30కు ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికంగా జరుగుతుంది.

పాయింట్లు క్లాష్ అవుతే ఎలా..?

పాయింట్లు క్లాష్ అవుతే ఎలా..?

ఆదివారం భారత్‌పై విజయం నమోదు చేసిన పాకిస్థాన్ సూపర్ 4పాయింట్ల పట్టికలో 2పాయింట్లతో పాటు 0.126 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక 2పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ 0.589గా ఉంది. టీమిండియా ఇండియా ప్రస్తుతం సున్నా పాయింట్లతో మైనస్ నెట్ రన్ రేట్ -0.126తో మూడో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సున్నా పాయింట్లతో -0.589 మైనస్ నెటరన్ రేట్‌తో నాల్గవ స్థానంలో ఉంది. ఇక ఒకవేళ పాయింట్ల పట్టికలో జట్లు సేమ్ పాయింట్లు సాధించినా.. నెట్ రన్ రేట్ ఏ జట్టుకు ఎక్కువగా ఉంటుందో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ముందు స్థానంలో ఉంటుంది. ఒక జట్టు 6పాయింట్లు సాధించి మిగతా మూడు జట్లు 2పాయింట్లు సాధిస్తే.. 2పాయింట్లు సాధించిన జట్టులో ఏ జట్టు నెట్ రన్ రేట్ అధికంగా ఉంటుందో ఆ జట్టు 6పాయింట్ల జట్టుతో కలిసి ఫైనల్ చేరుకుంటుంది.

భారత్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఎలా?

భారత్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఎలా?

ప్రస్తుత పరిస్థితి ప్రకారం.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ సూపర్ 4దశలో శ్రీలంకతో, ఆఫ్ఘనిస్తాన్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరుకునే వీలుంటుంది. భారత్ మిగిలిన రెండు గేమ్‌లను గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌తో కూడా ఓడిపోతే శ్రీలంక కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే.. శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్ తమ మిగిలిన గేమ్‌లో ఏదైనా గెలిస్తే నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. అందువల్ల టీమిండియా రెండు మ్యాచ్‌లల్లో గెలవడమే కాదు నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవడం చాలా కీలకం. అందువల్ల మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ అయినా పెద్ద మార్జిన్‌‌తో భారీ విజయం సాధించాలి.

Story first published: Monday, September 5, 2022, 13:00 [IST]
Other articles published on Sep 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+