IND vs PAK: పొరపాటున పాకిస్థాన్ గెలిస్తే.. టీమిండియా సెమీ ఫైనల్స్‌కు ఎలా చేరుకుంటుంది?
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం(నేడు) భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరో వైపు బంగ్లాదేశ్ ను ఓడించి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని అద్భుతంగా ప్రారంభించింది. ఇప్పుడు టీమిండియా సెమీ ఫైనల్స్ పై దృష్టి పెట్టింది. అయితే పాకిస్థాన్ టోర్నమెంట్ లో నిలవడం కోసం పోరాడుతోంది.
టీమిండియా ఓడిపోతే..?
కానీ ఈ సమయంలో అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఏం జరుగుతుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రస్తుతం రెండు పాయింట్లతో న్యూజిలాండ్ తర్వాత గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉంది. టీమిండియా పాకిస్థాన్ ను ఓడిస్తే సులభంగా సెమీ ఫైనల్స్ కు చేరుతుంది. కానీ టీమిండియా ఓడిపోతే గ్రూప్-ఏలో గందరగోళం ఏర్పడుతుంది. టీమిండియా ఒక వేళ ఓడిపోతే.. పాక్, భారత్ లు చెరో రెండు పాయింట్లు కలిగి ఉంటాయి. అప్పుడు న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ చేరుకోవడం సులభం అవుతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య సమస్య తలెత్తుతుంది. అటువంటి పరిస్థితిలో టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు చేరుకోవాలనుకుంటే ఈ రోజు పాకిస్థాన్ ను ఓఢించాలి.

టోర్నమెంట్ పాయింట్ల పద్ధతి ఏమిటి?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రతి విజయానికి జట్లకు రెండు పాయింట్లు ఇవ్వబడుతాయి. గ్రూప్ దశలో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ తర్వాత జట్లు సమాన పాయింట్లు సాధిస్తే నికర రన్ రేట్ ఆధారంగా జట్లు సెమీ-ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications