
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో న్యూలాండ్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలి టెస్టులోని రెండో రోజు ఇరు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ చివరి సమయానికి క్రీజులో ఉన్న పాండ్యా గురించి పూజారా ప్రశంసల వెల్లువను కురిపించాడు.
'ఈ మ్యాచ్‌లో పాండ్యా ఆ స్కోరు చేసుండకపోతే మ్యాచ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంతే కాదు, నేటి మ్యాచ్ ముగిసే సమయానికి రెండు వికెట్లు తీయగలిగామని శనివారం జరిగిన మ్యాచ్ గురించి కొనియాడాడు పూజారా.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. మేము డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంత ప్రశాంతంగా ఉండగలిగామంటే అది ఖచ్చితంగా పాండ్యా చేసిన స్కోరు ఫలితమే. ఇప్పటి వరకు విదేశాల్లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోయినా పాండ్యా చాలా బాగా రాణించాడు. 14ఫోర్లు ఒక సిక్స్ కలిపి 93 స్కోరును సాధించాడని పూజారా వ్యాఖ్యానించాడు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన పాండ్యా.. 'నేను అబద్దం చెప్పడం లేదు.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. శ్రీలంకతో టెస్టు సిరీస్ విశ్రాంతి సమయంలో ఫిటెనెస్, బ్యాటింగ్ మెరుగుపర్చుకున్నా. గత కొద్దిరోజులుగా ఈ దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించే అంతా చర్చించారు. దీంతో సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జీవితంలో సవాళ్లంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. అవి మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని నమ్ముతా' అని పాండ్యా అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.