Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : ఐదుగురు విదేశీ ప్లేయర్లను ఆడించిన ఢిల్లీ.. రూల్స్ బ్రేక్ చేసిందా?

How does Delhi Capitals played with five foreign players

ఐపీఎల్‌ను ఇన్నేళ్లుగా ఫాలో అవుతూ వస్తున్న క్రికెట్ ప్రేమికులు.. డబ్ల్యూపీఎల్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి థ్రిల్‌ను పంచుతున్న ఈ మ్యాచులు క్రీడాభిమానులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ చూస్తున్నప్పుడు అభిమానులందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది.

ఐదుగురు ఫారెన్ ప్లేయర్లా?

ఐదుగురు ఫారెన్ ప్లేయర్లా?

అదేంటంటే.. సాధారణంగా ఐపీఎల్‌లో ఒక జట్టు కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడించగలదు. నలుగురి కన్నా ఎక్కువ మంది విదేశీయులను ఆడించడం రూల్స్‌కు వ్యతిరేకం. అదే రూల్‌ను డబ్ల్యూపీఎల్ (మహిళల ప్రీమియర్ లీగ్)లో కూడా అమలు చేస్తున్నారని అంతా అనుకున్నారు.

కానీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఐదుగురు విదేశీ ప్లేయర్లను తీసుకుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఇంకా డబ్ల్యూపీఎల్‌లో తీసుకురాలేదు. మరి అలాంటప్పుడు ఢిల్లీ జట్టు ఐదుగురు విదేశీ ప్లేయర్లను ఎలా మైదానంలోకి దించింది?

బరిలో దిగిన విదేశీ ప్లేయర్లు ఎవరు?

బరిలో దిగిన విదేశీ ప్లేయర్లు ఎవరు?

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున సోఫీ డివైన్, హెదర్ నైట్, ఎలీస్ పెర్రీ, మేగన్ షూట్ బరిలో దిగారు. ఈ నలుగురు కూడా విదేశీ ప్లేయర్లే. రూల్స్ ప్రకారం ఆర్సీబీ నలుగురు ఫారెన్ ప్లేయర్లనే ఆడించింది. అదే సమయంలో ఢిల్లీ జట్టులో ఆడిన విదేశీ ప్లేయర్లు ఎవరంటే.. కెప్టెన్ మెగ్ లానింగ్, మారిజానే కాప్, అలైస్ కాప్సీ, జెస్ జోనాసెన్, టారా నోరిస్. వీరిలో నోరిస్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు కూడా సాధించింది.

గట్టిగా చెప్పాలంటే ఆమె వల్లనే ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడింది. అయితే డబ్ల్యూపీఎల్‌ రూల్స్ చూసుకున్నా ఒక జట్టులో మ్యాగ్జిమమ్ నలుగురు విదేశీ ప్లేయర్లే ఆడాలి. మరి ఢిల్లీ ఇలా ఐదుగురు విదేశీయులతో బరిలో దిగినా ఎవరూ ఎందుకని మాట్లాడటం లేదు?

ఢిల్లీకే ఆ రూల్ ఎందుకు?

ఢిల్లీకే ఆ రూల్ ఎందుకు?

కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద మాత్రమే ఇలా ఐదుగురు విదేశీ ప్లేయర్లను ఆడించే అవకాశం ఉంది. మరే జట్టూ ఇలా చెయ్యలేదు. ఎందుకంటే డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లే ఆడాలి. కానీ వీరితోపాటు అసోసియేట్ దేశానికి చెందిన మరో ప్లేయర్‌ను కూడా ఆడించొచ్చు. ఈ రూల్‌ను ఢిల్లీ క్యాష్ చేసుకుంది.

ఆర్సీబీపై ఐదు వికెట్లతో చెలరేగిన టారా నోరిస్.. అమెరికాకు చెందిన ప్లేయర్. ఐసీసీలో అమెరికా అసోసియేట్ నేషన్ మాత్రమే. దీంతో ఆమెను అదనంగా ఆడించే ఛాన్స్ ఆ జట్టుకు దక్కింది. మరే జట్టు వద్ద ఇలా అసోసియేట్ నేషన్‌కు చెందిన ఆటగాళ్లు లేకపోవడం గమనార్హం.

Story first published: Monday, March 6, 2023, 10:15 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+