ఇంగ్లాండ్ గురించి అన్నేసి మాటలు ఎలా అంటావ్..? హర్షా భోగ్లేకు సీరియస్ రిప్లేలు ఇచ్చిన బెన్ స్టోక్స్

లార్డ్స్‌లో చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేసిన తర్వాత దీప్తి శర్మపై ఆంగ్ల మీడియా విష ప్రచారం చేయడాన్ని హర్షా భోగ్లే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తీవ్ర పదజాలంతో కూడిన ట్విట్టర్ థ్రెడ్‌ను అతను పోస్టు చేశాడు. ఇక హర్షా భోగ్లే ఇంగ్లాండ్ మీడియా అత్యుత్సాహాన్ని, కల్చర్‌ను ఘాటుగా విమర్శించాడు. అయితే హర్ష ట్వీట్ల పట్ల ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. తన థ్రెడ్‌లో హర్షా భోగ్లే ప్రయోగించిన చాలా వ్యాఖ్యలను బెన్ స్టోక్స్ నిర్ద్వంద్వంగా ఖండించాడు.

మధ్యలో సంస్కృతిని ఎందుకు లాగుతున్నావ్
నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజులో నుంచి ముందే పరుగు తీసే "సంస్కృతి" ఆంగ్లేయులది అని ఎలా రాస్తావ్ అంటూ కాస్త ఘాటుగానే స్టోక్స్ పేర్కొన్నాడు. 'హర్షా .. మన్కడింగ్ విషయంలో ప్రజల అభిప్రాయాలు ఇలా ఉంటాయి అని సూటిగా చెప్పేస్తే పోయేదానికి ఇంగ్లాండ్ సంస్కృతి ఇలాంటిది అంటూ అసలు సంస్కృతిని ఎందుకు తీసుకురావాలి.. అది సంస్కృతికి సంబంధించిన ముచ్చటనా? అంటూ స్టోక్స్ ట్వీట్లలో రిప్లే ఇచ్చాడు.
నాపై ఇండియన్స్ కామెంట్లు చేయట్లేదా?
'హర్షా .. 2019 వరల్డ్ ఫైనల్ ముగిసి ఇప్పటికీ 3ఏళ్లవుతుంది. నన్ను ఉద్దేశించి ఇప్పటికీ చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తూ నానా హంగామా చేస్తూనే ఉన్నారు. ఆ విషయం మిమ్మల్ని మరీ డిస్టర్బ్ చేయట్లేదా? కేవలం ఇంగ్లాండ్ విషయంలోనే మీకు ఇలాంటి ఒపినియన్ ఎందుకు' అని స్టోక్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
'ప్రపంచవ్యాప్తంగా మన్కడింగ్ రనౌట్ గురించి కామెంట్లొస్తున్నాయి. కేవలం మా ఇంగ్లాండ్ వాళ్లే కామెంట్లు చేయట్లేదు. కానీ మమ్మల్ని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్లు చేయడం ఎంతవరకు సబబు. ఈ ప్రత్యేక సంఘటనపై మిగిలిన దేశాల స్పందన పట్ల మీరేమంటారు. రనౌట్ గురించి మాట్లాడ్డానికి క్రికెట్ కేవలం ఇంగ్లాండ్ మాత్రమే ఆడట్లేదు కదా' అంటూ స్టోక్స్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ మీడియా రాద్ధాంతాన్ని కడగిపారేసిన హర్షా
దీప్తి శర్మ రనౌట్ చేయడం పట్ల ఇంగ్లాండ్ మీడియా చేస్తున్న రాద్ధాంతాన్ని హర్ష భోగ్లే ఖండించిన సంగతి తెలిసిందే. దీప్తి క్రికెట్ చట్టాల ప్రకారం ఆడిందని.. ఆమె మీద ఎలాంటి విమర్శలు చేయడం సరికాదని, ఇంగ్లాండ్ మీడియా తమ ప్లేయర్ తప్పును కప్పేసి.. దీప్తిని దోషిగా నిలబెట్టే పని చేస్తోందంటూ మండిపడ్డాడు.
క్రీజు దాటుతూ ఇల్లీగల్ ప్రయోజనాన్ని పొందడం కోసం ప్రయత్నించిన ఛార్లీ డీన్‌ను ముందు ప్రశ్నించుకోండంటూ కడిగిపారేశాడు. ఇంగ్లాండ్ మీడియా తీరు తనను విస్మయానికి గురిచేస్తోందన్నాడు. క్రికెట్ ఆడే దేశాలను వారు పాలించినందున.. క్రికెట్లో వాళ్లు చెప్పిందే రైట్, రాంగ్ అని పడిపోయాయంటూ ఆ మనస్తత్వాన్ని బద్ధలు కొట్టాలంటూ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications