Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: కెప్టెన్‌గా చివరిరోజు ధోని ఏం చేశాడో తెలుసా?

హైదరాబాద్: దేశ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి బుధవారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. మూడు ఫార్మెట్లలో కూడా భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు.

టెస్టులు, వ‌న్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఉన్న ధోని అనేక విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.

ఆటగాడిగా కొనసాగుతా

ఆటగాడిగా కొనసాగుతా

2014లో ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మెట్ నుంచి పూర్తిగా వైదొలగిన ధోని జనవరి 15న నుండి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌లకు కెప్టెన్‌గా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ధోని మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఆశ్చర్య పరిచిన ధోని నిర్ణయం

ఆశ్చర్య పరిచిన ధోని నిర్ణయం

ధోని హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అతని అభిమానులేనే కాదు, యావత్ భారతదేశ క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే కెప్టెన్‌గా ధోని చివరిరోజు ధోని ఏం చేశాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవరం నాడు రంజీ ట్రోఫీలో భాగంగా గుజరాత్-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ని ధోని తిలకించాడు.

కెప్టెన్సీపై నిర్ణయం అక్కడే తీసుకున్నాడు

కెప్టెన్సీపై నిర్ణయం అక్కడే తీసుకున్నాడు

అక్కడ ఉండగానే ధోని తన కెప్టెన్సీపై నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇందులో భాగంగా ధోని తన రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లతో 30 నిమిషాల పాటు సమావేశమయ్యాడు. తన క్రికెట్ ప్రస్థానంలోని ఎత్తు పల్లాలను జార్ఖండ్ ఆటగాళ్లతో పంచుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గత నాలుగు రోజులుగా ధోని నాగ్ పూర్‌లో ఉన్నాడు.

జార్ఖండ్ ఆటగాళ్లతో ధోని ప్రాక్టీస్

జార్ఖండ్ ఆటగాళ్లతో ధోని ప్రాక్టీస్

కెప్టెన్సీపై తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ధోని సహచరులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీనిలో భాగంగా జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్‌కు ధోని కొన్ని మెళుకువులు నేర్పాడు. ఈ క్రమంలోనే నాలుగు రకాల బ్యాట్లను పరిశీలించి తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు.

హోటల్ సిబ్బందికి ధోని ఆటోగ్రాఫ్స్

హోటల్ సిబ్బందికి ధోని ఆటోగ్రాఫ్స్

రంజీ మ్యాచ్ అనంతరం హోటల్ సిబ్బందికి ధోని ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. బాల్ బాయ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగాడు. దీనికి ముందు నాలుగో రోజైన మంగళవారం వీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ కలిసి సుదీర్ఘంగా ముచ్చటించాడు.

కెప్టెన్సీకి గుడ్ బై

కెప్టెన్సీకి గుడ్ బై

అనంతరం బుధవారం రాత్రి వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోని వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా అందుబాటులో ఉంటాడు.

కెప్టెన్సీకి ధోని గుడ్ బై: మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా కోహ్లీ

కెప్టెన్సీకి ధోని గుడ్ బై: మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా కోహ్లీ

కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. ధోని నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. అయితే పలువురు మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా, 2019వరకూ భారత జట్టులో ధోని ఆటగాడిగే కొనసాగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+