దటీజ్ ధోని!: ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదు


హైదరాబాద్: 'ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదు' ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇది. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.
ఉత్కంఠకర మ్యాచ్‌ల్లో సైతం ఎలాంటి ఆందోళన చెందకుండా జట్టును ముందుకు నడిపించాడు. అందుకే ధోనీని అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. భారత జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవచ్చేమో కానీ, అతడి విలువైన సలహాలు ఎప్పుడూ జట్టుకు ఉపయోగపడుతూనే ఉన్నాయి.
ధోని ఇచ్చిన సలహాల వల్లే జట్టు విజయం
ధోని ఇచ్చిన సలహాల వల్ల జట్టు విజయం సాధించిన సందర్భాలు అనేకం. మైదానంలో బ్యాట్స్‌మెన్ ఆటతీరుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించడంలో ధోని దిట్ట. తాజాగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ధోని చెప్పిన చిన్న మార్పు వల్ల బంగ్లాదేశ్ జట్టన తన కీలక వికెట్‌ను కోల్పోయింది.
తొలి మూడు బంతుల్లో రెండో ఫోర్లు
జడేజా వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో రెండు, మూడో బంతులను బంగ్లాదేశ్ కీలక బ్యాట్స్‌మన్ షకీబ్ వరుసగా ఫోర్లుగా బాది జోరు మీదున్నాడు. తొలి మూడు బంతుల్లో ఒకటి నోబాల్, ఒకటి డెడ్‌బాల్ వేసి రెండు బౌండరీలు ఇచ్చాడు. వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్న ధోనీ.. కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వచ్చి శిఖర్ ధావన్‌ను స్లిప్ నుంచి స్వ్కేర్ లెగ్‌కు మార్చమని చెప్పాడు.
ధావన్‌కే క్యాచ్ ఇచ్చిన షకీబ్
రోహిత్ శర్మ అలాగే చేశాడు. ఇది అద్భుత ఫలితాన్నిచ్చింది. ఆ వెంటనే నాలుగో బంతికే షకీబ్ స్వీప్ షాట్ ఆడి నేరుగా ధావన్‌కే క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ స్థానాన్ని ధోని మార్చమని చెప్పడం వల్లే షకీబ్ వికెట్ తీయడం సాధ్యమైంది. దీంతో ధోనీపై మరోసారి అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
ధోనీ మళ్లీ నిరూపించాడు
"ధోనీ మళ్లీ నిరూపించాడు.. తలా మాస్టర్‌మైండ్, వికెట్ల వెనుకనుంచే బ్యాట్స్‌మెన్ ఆలోచనను పసిగట్టగల వ్యక్తి.. ధోనీ కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదులుకోలేదు.. అందుకే ధోనీని ఉత్తమ కెప్టెన్ అంటారు" సోషల్ మీడియాలో అభిమానులు ధోనిని ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications