'విరాట్ 70 శతకాలు చేసాడు.. అలాంటి కోహ్లీ టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు'

లాహోర్: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అండగా నిలిచాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుత టెక్నిక్‌తో 70 శతకాలు సాధించాడు. ఎంతో మంది కోహ్లీ టెక్నిక్ గురించి ఇప్పడు మాట్లాడుతుండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు అతడి టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు అని ఇంజమామ్ ప్రశ్నించాడు.

టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు:
తాజాగా ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... 'చాలామంది విరాట్ కోహ్లీ టెక్నిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది విన్న నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ 70 శతకాలు చేశాడు. అలాంటప్పుడు అతడి టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు. కొన్ని సార్లు ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా పరుగులు సాధించలేరు. క్రికెటర్లు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి దశను ఎదుర్కొంటారు. ఇది ఒకటో రెండో సిరీస్‌లకు మాత్రమే పరిమితమవుతుంది' అని అన్నారు.

ఒకటే చెప్పా:
'మొహమ్మద్ యూసుఫ్ గల్లీవైపు అద్భుతంగా ఆడి పరుగులు రాబట్టగలడు. అతడు ఎంత మంచి ఆటగాడో మనకు తెలుసు. యూసుఫ్ ఫామ్ కోల్పోయినప్పుడు అందరూ అతడి టెక్నిక్ గురుంచి మాట్లాడారు. అయితే నేను మాత్రం అతడికి ఒకటే చెప్పా. నీ టెక్నిక్‌లో లోపం ఉంటే ఇన్ని పరుగులు ఎలా చేయగలిగావని ప్రశ్నించా' అని ఇంజిమామ్ వివరించారు.

మిగిలిన వారి పరిస్థితి ఏంటి?:
'న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జట్టుగా రాణించలేకపోయింది. కోహ్లీ కూడా ఆకట్టుకోలేకపోయాడు. కోహ్లీ సంగతి పక్కన పెడితే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి?. ఇది ఆటలో సహజం. దాన్ని అలానే అంగీకరించాలి. టీమిండియా ఈ దశను తప్పకుండా అధిగమిస్తుంది. దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు' అని పాక్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.

కోహ్లీ బలమైన మైండ్ ప్లేయర్:
'విరాట్ కోహ్లీ ఎంతో బలమైన మైండ్ ప్లేయర్. గొప్ప ఆటగాడికి ఆలోచన ధోరణి బలంగా ఉంటే సులువుగా తిరిగి పుంజుకొగలడు. కోహ్లీ కచ్చితంగా పుంజుకుంటాడు. కొన్ని సార్లు బలాలే మన బలహీనతలు అవుతాయి. ఎక్కడ ఎక్కువగా పరుగులు సాధిస్తామో.. అక్కడే ఔట్ అవ్వాల్సి వస్తుంది. కోహ్లీ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications