అందుకే విరాట్ కోహ్లీని టీం నుంచి తప్పించలేం : దినేష్ కార్తీక్

భారత వికెట్ కీపర్ కం ఫినిషర్ దినేష్ కార్తీక్.. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడంటూ పేర్కొన్నాడు. విరాట్ లాంటి స్టార్ బ్యాటర్‌ని తొలగించలేమని చెప్పాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో 33ఏళ్ల కోహ్లీ తన పేలవ ఫామ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. కెరీర్లోనే చాలా గడ్డు రోజులను విరాట్ కోహ్లీ ఎదుర్కొంటున్నాడు. చివరిసారిగా 2019లో అతను సెంచరీ చేశాడు. ఆ తర్వాత అతను తన మార్క్‌కు తగ్గట్లు రాణించలేదు సరికదా.. కెప్టెన్సీ నుంచి వైదొలిగా పూర్తిగా తన రిథమ్ కోల్పోయాడు. ఐపీఎల్లో చెత్త ప్రదర్శన కొనసాగించిన కోహ్లీ.. టీమిండియా తరఫున కూడా ఏమాత్రం ప్రభావం చూపని బ్యాటర్‌గా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు
ఇక కోహ్లీ ప్రదర్శన పట్ల చాలా మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. కపిల్ దేవ్ లాంటి ఉద్ధండులు సైతం కోహ్లీని తప్పించాలన్నట్లు మాట్లాడారు. అయితే కోహ్లీకి సపోర్ట్ కూడా బానే వస్తుంది. ఇటీవల పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సైతం దిస్ టు షల్ పాస్ స్టే స్ట్రాంగ్ అంటూ కోహ్లీకి మద్దతుగా ట్వీట్ చేశాడు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీని ఒకట్రెండు సిరీస్‌ల ప్రదర్శన ద్వారా అంచనా వేయలేమని పేర్కొన్నాడు. ఇక తాజాగా కుడిచేతి వాటం బ్యాటర్‌కు మద్దతుగా దినేష్ కార్తీక్ నిలిచాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. కోహ్లీ తన కెరీర్లో అద్భుతమైన విజయాలను అందుకున్నాడని చెప్పాడు. వెస్టిండీస్ టూర్‌లో అతన్ని తీసుకోకపోవడంతో అతనికి మంచి విరామం లభిస్తుందని, మళ్లీ పూర్తిగా రీఛార్జ్ అయి మునుపటిలా కమ్ బ్యాక్ అవుతాడని ఆశించాడు.

అతని స్థాయి ఆటగాడిని ఎలా?
'విరాట్ కాలక్రమేణ ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు అతనికి మంచి విరామం లభిస్తుంది. ఇక మళ్లీ రీఛార్జ్ అయ్యి తిరిగి వస్తాడు. తిరిగి అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను. అతని స్థాయి ఆటగాడిని మీరు ఎప్పటికీ తొలగించలేరు.' అని దినేష్ కార్తీక్ అన్నాడు. ఇకపోతే దినేష్ కార్తీక్.. సైతం జట్టులో చోటు కోల్పోయి ఐపీఎల్లో అద్వితీయంగా ఫామ్ పుంజుకుని తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 37ఏళ్ల దినేష్ కార్తీక్ తన పునరాగమనం గురించి మాట్లాడుతూ.. ఇది నిజంగా చాలా కష్టమైన విషయం అయినప్పటికీ, జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పాడు.

అందుకోసం చాలా కష్టపడ్డాను
ఇంకా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. 'జాతీయ జట్టులోకి సెలెక్ట్ కావడం అంత సులభం కాదు, కానీ నేను దాని కోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు టీమిండియాకు చాలా మంది సత్తా ఉన్న బెంచ్ ప్లేయర్లు ఉన్నారు. అందువల్ల టీమిండియాలో చోటు సంపాదించడానికి చాలా పోటీ ఎప్పుడూ ఉంటుంది. భారత క్రికెట్‌కు ఇప్పుడు ఓ మోజో ఉంది' అని కార్తీక్ అన్నాడు. ఇకపోతే ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక విషయంలో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కుతుందో లేదో అనే డైలామా ఉంది. ఎందుకంటే సీనియర్లు అందరూ తిరిగి జట్టులోకి రావడంతో ఎవర్నీ ఎంపిక చేయాలనే విషయమై టీం మేనేజ్ మెంట్ మల్లాగుల్లాలు పడుతుంది.

జట్టుగా ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్నాం
ఇక ప్రపంచకప్ ఈవెంట్‌లో సవాళ్లను ఎదుర్కోవడానికి జట్టు సిద్ధమవుతోందని, జట్టు చుట్టూ ఉన్న వాతావరణం చాలా సానుకూలంగా ఉందని దినేష్ కార్తీక్ చెప్పాడు. 'ఒక జట్టుగా మేము రాబోయే ప్రపంచకప్‌లో ఎదుర్కోవాల్సిన సవాళ్లకు సిద్ధమవుతున్నాం. పెద్ద ఈవెంట్‌కు సిద్ధమవుతున్నప్పుడు కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిఒక్కరినీ అందుకు తగ్గట్లు సమాయాత్తం చేస్తున్నారు. జట్టులో సానుకూల వాతావరణం ఉంది.' అని కార్తీక్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications