Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ క్వాలిఫైయర్-1 చేరాలంటే..?

ఐపీఎల్ 2026 లీగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్న వేళ ప్లేఆఫ్స్ రేసు.. ముఖ్యంగా టాప్-2 స్థానాల కోసం జట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నప్పటికీ.. క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కే ఆ టాప్-2 స్థానాన్ని దక్కించుకోవడంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇవాళ ఆర్సీబీతో జరగబోయే కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2 స్థానంలో నిలవాలంటే ఎలాంటి సమీకరణాలు అవసరమో తెలుసుకుందాం.

మూడు జట్ల ఖాతాలో సమాన పాయింట్లు.. నెట్ రన్ రేట్ కీలకం!
ఇవాల్టి మ్యాచ్‌లో ఒకవేళ ఆర్సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ విజయంతో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్‌హెచ్.. ఈ 3 జట్ల ఖాతాలోనూ సమానంగా 18 పాయింట్లు చేరతాయి. అయితే పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ +1.065 అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ, వారి రన్ రేట్ భారీగా దెబ్బతినే అవకాశం లేదు కాబట్టి ఆర్సీబీ నంబర్ వన్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.

How Can Sunrisers Hyderabad Reach Qualifier 1 in IPL 2026 Top 2 Qualification Scenarios Details

గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టడమే సన్‌రైజర్స్ లక్ష్యం!
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు +0.695 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ ఆర్సీబీపై హైదరాబాద్ కేవలం విజయం సాధిస్తే సరిపోదు, రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ను దాటాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎస్‌ఆర్‌హెచ్ ప్రస్తుతం ఉన్న రన్ రేట్‌ను మెరుగుపరుచుకుని గుజరాత్ జట్టును దాటాలంటే వారి ముందు కేవలం రెండు కఠినమైన మార్గాలు మాత్రమే ఉన్నాయి. టాప్-2 స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సన్‌రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

మొదటి మార్గం: తొలుత బ్యాటింగ్ చేస్తే ఏం చేయాలి?
ఒకవేళ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే.. పరుగుల వరద పారించాల్సిందే. సన్‌రైజర్స్ జట్టు బోర్డుపై కనీసం 220 పరుగుల భారీ స్కోరును ఉంచాలి. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చెలరేగి, ప్రత్యర్థి బెంగళూరు జట్టును కట్టడి చేయాలి. ఈ సమీకరణం ప్రకారం.. 220 పరుగులు చేసిన అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కనీసం 88 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీని ఓడించాల్సి ఉంటుంది. అప్పుడే గుజరాత్ నెట్ రన్ రేట్‌ను దాటి హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంటుంది.

రెండో మార్గం: చేజింగ్‌లో చెలరేగాల్సిందే!
మరోవైపు ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్ష్యఛేదనకు దిగితే.. సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర మోడ్‌లోకి వెళ్లక తప్పదు. ఉదాహరణకు బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఆ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 11.1 ఓవర్ల నుంచి 11.3 ఓవర్ల లోపే ఛేదించాల్సి ఉంటుంది. అంటే దాదాపు టీ20 మ్యాచ్‌ను కాస్తా టీ-10 మ్యాచ్‌లా ఆడి బౌండరీల వర్షం కురిపిస్తేనే సన్‌రైజర్స్‌కు ఆశించిన టాప్-2 స్థానం దక్కుతుంది. ఈ రెండు సమీకరణాల్లో హైదరాబాద్ ఏది సాధించినా క్వాలిఫైయర్-1 ఆడే లక్కీ ఛాన్స్ దక్కుతుంది.

Story first published: Friday, May 22, 2026, 9:44 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+