ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా తాజాగా జరిగిన కీలక అప్ఘానిస్థాన్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో వర్షం పడటం వల్ల ఫలితం నిర్ణయించలేదు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ ను కేటాయించడం వల్ల ఆసీస్ నాలుగు పాయింట్లతో సెమీస్ కు అర్హత సాధించగా, అప్ఘాన్ మాత్రం దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో ఉంది. అయితే, ఆఫ్ఘానిస్థాన్ కు ఇంకా సెమీ ఫైనల్‌కు చేరే అవకాశాలు కాస్త ఉన్నాయి. దీనికి కొన్ని సమీకరణాలు సహకరించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
సౌతాఫ్రికా కర్మ కాలితే...
ఆఫ్ఘానిస్థాన్ సెమీ ఫైనల్స్ చేరుకోవడం అనేది ఇంగ్లాండ్ పై ఆధారపడి ఉంది. గ్రూప్ బీలో ఇంకా ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. మార్చి 1న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ లో సాధారణంగా దక్షిణాఫ్రికా గెలిచినా.. ఓడినా సెమీస్ కు చేరుకుంటుంది. కానీ సౌతాఫ్రికా కర్మ కాలి భారీ తేడాతో ఓడితే మాత్రం అప్ఘానిస్థాన్ కు అది కలిసొస్తుంది. రన్ రేట్ తేడా కారణంగా అఫ్ఘాన్ సెమీస్ చేరుతుంది.

కాబట్టి దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయాలి. ముందుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించి, 207 పరుగులు తేడాతో విజయం సాధించాలి. లేదంటే సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తే, ఇంగ్లాండ్ ఆ లక్ష్యాన్ని 11.1 ఓవ్లలోనే ఛేదించాలి.. అప్పుడు అప్ఘాన్ సెమీస్ కు చేరుకుంటుంది. అసలు ఈ మ్యాచ్ కు వర్షం కారణంగా రద్దైతే.. దక్షిణాఫ్రికా సెమీస్ కు వెళ్లిపోతుంది.
పాయింట్ల వివరాలివే..
ప్రస్తుతం, గ్రూప్ బీలో ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475) ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘానిస్థాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Rain Stops Play! 🌧️
— Afghanistan Cricket Board (@ACBofficials) February 28, 2025
A slight drizzle has interrupted the proceedings in Lahore, with the scoreline being 109/1 after 12.5 overs. 👍#AfghanAtalan | #ChampionsTrophy | #AFGvAUS | #GloriousNationVictoriousTeam pic.twitter.com/cz5ARtM3XM
Omarzai Strikes!☝️@AzmatOmarzay gives #AfghanAtalan an early success with the ball as he gets Matthew Short chipping one to mid-on, where @GbNaib takes an excellent catch running backward.👏
— Afghanistan Cricket Board (@ACBofficials) February 28, 2025
🇦🇺- 44/1 (4.3 Ov)#ChampionsTrophy | #AFGvAUS | #GloriousNationVictoriousTeam pic.twitter.com/SVmLijXGuf