Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెంట దిగ్గజాలు రాగా బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన గంగూలీ

 House needs to be set in order: Sourav Ganguly after applying for BCCI presidents post

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

గంగూలీ నామినేషన్ సందర్భంగా అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్‌ షా, ఎన్‌ శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలు ఉన్నారు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇక, బీసీసీఐ కోశాధికారిగా అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ ధూమల్‌ నామినేషన్‌ వేశారు. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లకు సోమవారం ఆఖరు తేదీ కావడంతో గంగూలీ తప్ప మరెవరు నామినేషన్‌ వేయలేదు.

గంగూలీ ఎన్నిక లాంఛనమే

గంగూలీ ఎన్నిక లాంఛనమే

దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనమే. ఢిల్లీలో శనివారం అమిత్‌ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ అధ్యక్షుడు ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని అమిత్ షా కోరగా గంగూలీ హామీ ఇవ్వలేదు.

తెరపైకి బ్రిజేష్‌ పటేల్‌ పేరు

తెరపైకి బ్రిజేష్‌ పటేల్‌ పేరు

దీంతో శ్రీనివాసన్‌ వర్గానికి చెందిన బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. అతడి అభ్యర్థిత్వాన్ని ఎక్కువ సంఘాలు వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. బీసీసీఐకి నూతన అధ్యక్షుడు ఎన్నికతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఓఏ) 33 నెలల పాలన ముగియనుంది.

గంగూలీ మాట్లాడుతూ

గంగూలీ మాట్లాడుతూ

గంగూలీ మాట్లాడుతూ "రూల్ అదే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు ప్రాధాన్యత. దానిపైనే ప్రధానంగా దృష్టి పెడతా. నా తొలి ప్రాముఖ్యత ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకే. ఇదే విషయాన్ని సీఓఏకు విజ్ఞప్తి చేశా.. కానీ వారు పట్టించుకోలేదు. రంజీ ట్రోఫీ క్రికెట్‌పై ఫోకస్ ఉంటుంది. క్రికెటర్లు ఆర్థిక ఆసక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని తెలిపాడు.

తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా

తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా

తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూనిట్లు మద్దతు తెలపడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని గంగూలీ తెలిపాడు.

నా నియామకంతో సంతోషంగా ఉన్నాను

నా నియామకంతో సంతోషంగా ఉన్నాను

"నేను నియామకంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది బిసిసిఐ యొక్క ఇమేజ్ దెబ్బతిన్న సమయం. నాకు ఏదైనా చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని గంగూలీ అన్నాడు. గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైనప్పటితో పోలిస్తే ఇప్పుడు తన భావోద్వేగాలు ఎలా ఉన్నాయని మీడియా ప్రశ్నించగా.. టీమిండియా కెప్టెన్‌కి మించిన బాధ్యత మరేదీ లేదని గంగూలీ అన్నాడు.

Story first published: Monday, October 14, 2019, 16:15 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+