For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-బంగ్లా మ్యాచ్ పాకిస్తాన్‌ పోరును మించిపోయిందిగా - హాట్‌స్టార్ చరిత్రలో ఫస్ట్ టైమ్

 Hotstar viewership peaked at 19 million during the India vs Bangladesh match at Adelaide

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు మరో ఘన విజయాన్ని అందుకుంది.. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో అయిదు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మిగిల్చిన పరాభవాన్ని బంగ్లాపై తీర్చుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో దమ్ము దులిపింది. ప్లేయర్ల మెరుపు ఫీల్డింగ్- దీనికి బోనస్. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్ 2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

అయిదు పరుగుల తేడాతో..

అయిదు పరుగుల తేడాతో..

వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ- దాన్ని కాపాడుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60, మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 పరుగులు చేశారు.

సెమీస్‌కు ఇంచ్ దూరంలో..

సెమీస్‌కు ఇంచ్ దూరంలో..

డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా, షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

రికార్డ్ స్థాయి వ్యూవర్‌షిప్..

రికార్డ్ స్థాయి వ్యూవర్‌షిప్..

భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. రికార్డుస్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. కిందటి నెల 23వ తేదీన మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ వ్యూవర్‌షిప్‌ను దాటేసింది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా లక్షలాది మంది ఈ మ్యాచ్‌ను తిలకించారు. 19 మంది మిలియన్ల మంది హాట్‌స్టార్ యాప్ ద్వారా అడిలైడ్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో లైవ్ టెలికాస్ట్ అయింది.

సెమీస్ చేర్చే మ్యాచ్ కావడం వల్లే..

సెమీస్ చేర్చే మ్యాచ్ కావడం వల్లే..

నిజానికి ఈ మ్యాచ్‌ ప్రారంభ ఓవర్లల్లో భారత్ బౌలర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ సునామీలా విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఈ పరిణామం.. హాట్‌స్టార్ వ్యూవర్‌షిప్‌ను ఒక్కసారిగా పెంచింది. మ్యాచ్ ఉంటుందా? పోతుందా? అనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమైంది. లిట్టన్ దాస్ రనౌట్ తరువాత బౌలర్లు విజృంభించడం.. వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Story first published: Wednesday, November 2, 2022, 19:37 [IST]
Other articles published on Nov 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+