Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.299 చెల్లిస్తే ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆలస్యం లేకుండా వీక్షించొచ్చు!

Hotstar unveils subscriptions pack for IPL, live Sports

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్ 7న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు స్టార్‌నెట్ వర్క్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐపీఎల్ డిజటల్ రైట్స్‌ను కలిగి ఉన్న స్టార్ ఇండియా తన హాట్‌స్టార్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

రూ.299 చెల్లించి వార్షిక స్పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను హాట్‌స్టార్‌లో యూజర్లు తీసుకుంటే ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి ఆలస్యం లేకుండా వీక్షించొచ్చు. అంతేకాదు ఏడాది పాటు హాట్‌స్టార్ యాప్‌లో పలు స్పోర్ట్స్ చానల్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, ఫార్ములా 1 క్రీడలను చూసేందుకు వీలుని కల్పించింది.

ఇప్పటికే స్టార్ ఇండియా హాట్‌స్టార్‌లో రూ.199కు గాను నెలవారీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, రూ.999కు వార్షిక ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మొత్తం 6 భాషల్లో కామెంటరీని అందిస్తోంది. ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, తెలుగులలో ఈసారి ప్రేక్షకులు కామెంటరీని ఎంజాయ్ చేయనున్నారు.

మరోవైపు పైన చెప్పిన మూడు ప్లాన్లలో ఏ ప్లాన్ తీసుకున్నా హాట్‌ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద యూజర్లు ఏడాదిపాటు క్రికెట్ (ఐపీఎల్, ఆసియా కప్ తదితర టోర్నీలతో పాటు), ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, ఇతర క్రీడలను ఎంచక్కా వీక్షించవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హాట్‌స్టార్ రానున్న ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ ఫీడ్‌ను ఆయా యాప్‌లకు ఇవ్వనుంది.

దీంతో జియా, ఎయిర్‌టెల్ యాప్‌లను వాడే యూజర్లు ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ ఫీడ్‌ను చూడొచ్చు. హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోని యూజర్లు ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఉచితంగా చూడాలనుకుంటే 10 నిమిషాలు ఆలస్యంగా వీక్షించాల్సిందే. అలా కాకుండా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను చూడాలనుకుంటే రూ.299, రూ.199, రూ.999 లలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకుంటే మంచిది.

Story first published: Tuesday, April 3, 2018, 21:57 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+