ఐపీఎల్ ఫైనల్: గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టిన హాట్‌స్టార్

హైదరాబాద్: నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని ఆదివారం ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడం... చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగడంతో ఈ మ్యాచ్‌ని పెద్ద ఎత్తున ప్రేక్షకులు వీక్షించారు.
స్పెషల్ స్టోరీలు: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019
ఈ క్రమంలో లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హాట్ స్టార్ రికార్డుల మోత మ్రోగించింది. ఉప్పల్ వేదికగా చెన్నై vs ముంబై జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని 8 నుంచి 12 మిలియన్ల మంది వీక్షించారు. చేధనలో చెన్నై బ్యాట్స్‌మన్ షేన్ బాట్సన్(59 బంతుల్లో 80) చివర్లో మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాట్ స్టార్ వీక్షకుల సంఖ్య మరింతగా పెరగడం విశేషం.

గెలుపు అంచుల వరకు తీసుకెళ్లిన వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 2018 సీజన్ ఐపీఎల్ ఫైనల్లో కూడా షేన్ వాట్సన్ తనదైన శైలిలో విజృంభించి ఆడి చెన్నైని గెలిపించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సీజన్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వాట్సన్ అదే విధంగా గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. అయితే, ఫైనల్లో వాట్సన్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముంబైవైపుకి మళ్లింది.

17వ ఓవర్‌లో16 మిలియన్లకు చేరిన వీక్షకుల సంఖ్య
చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వీక్షకుల సంఖ్య 16 మిలియన్ల వరకు పెరిగింది. ఆ తర్వాత ఆఖరి ఓవర్ సమయానికి ఈ సంఖ్య 18.6 మిలియన్ల వరకు చేరుకుని చివరకు 18.3 మిలియన్ల(సమకాలనీ వీక్షకులు) వద్ద ముగిసింది. ఈ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ రనౌట్ అయిన సమయానికి చెన్నై విజయానికి నాలుగు పరుగులు అవసరమైన సంగతి తెలిసిందే.

గ్లోబల్ రికార్డుని బద్దలు కొట్టిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హాట్ స్టార్ గత గ్లోబల్ రికార్డు కూడా బద్దలైంది. ఈ సీజన్‌లో మార్చి 28న ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని అత్యధికంగా 12.7 మిలియన్ మంది వీక్షించారు. ఆ రికార్డు వీక్షకుల సంఖ్యని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. కేవలం మూడు వారాల్లోనే హాట్ స్టార్ 267 మిలియన్ ఆడియన్స్ మార్కుని అందుకుంది.

ఒక పరుగు తేడాతో ముంబై విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications