విశాఖపట్నం: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి విశాఖపట్నంలో జరగనుంది. ఈ సందర్భంగా పిచ్ క్యూరేటర్ మల్లయ్య మీడియాతో మాట్లాడాడు. విశాఖ పిచ్ ప్రత్యేకంగా టెస్టు మ్యాచ్ నిమిత్తం తయారు చేసిన వికెట్ అని, బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా పిచ్ సహకరిస్తుందని తెలిపాడు.
నిజానికి రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో నాలుగైదు నెలల క్రితమే కొత్తగా పిచ్‌లు రూపొందించారు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో భాగంగా ఒడిశా, విదర్భ జట్ల మధ్య తొలి రంజీ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత అసోం-రాజస్ధాన్ జట్ల మధ్య జరిగిన రెండో రంజీ మ్యాచ్ వివాదాస్పదమైంది.
ఎందుకంటే మూడో రోజు ఆటలో భాగంగా 17 వికెట్లు ఒకే రోజు నేలకూలాయి. దీంతో ఈ పిచ్‌పై పలువురు క్రికెట్ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసోం, రాజస్థాన్ మ్యాచ్‌లో కొన్ని బంతులు మరీ తక్కువ ఎత్తులో వచ్చాయని ఆ జట్టు కోచ్ సునీల్ జోషి ఫిర్యాదు చేశాడు.

ఇది నాసిరకం పిచ్ అంటూ ఆరోపించాడు. అంతేకాదు ఈ పిచ్‌పై అంతర్జాతీయ వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించాడు. విశాఖ పిచ్‌పై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఎక్కడ జారిపోతాయనే ఉద్దేశ్యంతో పట్టువదలకుండా, పిచ్‌ను మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చేందుకు అనుకూలంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తయారు చేయించింది.
వివాదంలో విశాఖ పిచ్: టెస్టు మ్యాచ్‌పై అనుమానాలు?
అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్లు బ్యాట్‌పైకే బంతి రాలేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో టీమిండియా స్ఫిన్నర్లు న్యూజిలాండ్‌ను 79 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ చేతిలో న్యూజిలాండ్ 190 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ పిచ్‌పై జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్ మీడియాతో మాట్లాడారు.
స్టేడియంలో ఉన్న తొమ్మిది పిచ్‌లలో నాలుగో పిచ్‌ను ఈ మ్యాచ్ కోసం వినియోగిస్తున్నామని చెప్పాడు. ఈ పిచ్ ప్రారంభంలో బంతి బౌన్స్ అవుతుందని, బ్యాటింగ్‌కు, పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని, రెండు రోజుల అనంతరం తన స్వరూపం మార్చుకుని పూర్తిగా స్పిన్నర్లకు సహకరిస్తుందని పేర్కొన్నాడు.
బిసిసిఐ పిచ్ క్యూరేటర్ శ్రీరామ్, ఆషిష్ బౌమిజ్‌లు పిచ్‌ను తయారు చేయడంలో సూచనలు ఇచ్చారని, వారి సూచనల మేరకు పిచ్‌ను రూపొందించినట్టు వెల్లడించాడు. ఔట్ ఫీల్డ్‌లో బంతి జోరుగా పరుగులు తీస్తుందని చెప్పాడు. పిచ్‌ను మంచి డిజైన్ వచ్చే విధంగా పచ్చికను అందంగా తీర్చిదిద్దామని వివరించాడు.
ఇంగ్లాండ్ మీడియా ప్రతినిధులు పిచ్‌ను పరిశీలించి, ఇప్పటి వరకూ చూసిన పిచ్‌లలో ఇది అత్యుత్తమ పిచ్‌గా కితాబునిచ్చిందని తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కుక్ కూడా పిచ్‌ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశాడని తెలిపాడు. కాగా, రెండో టెస్టు కోసం మంగళవారం ఇరు జట్లు ముమ్మర సాధన చేశాయి.
స్టేడియానికి ఉదయం 9 గంటలకు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు పిచ్‌ను కొంతసేపు పరిశీలించిన అనంతరం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. కుక్ నాయకత్వంలోని ఆ జట్టు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చి మూడు గంటల పాటు విరామం లేకుండా నెట్స్‌లో సాధన చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రాక్టీస్ ప్రారంభించిన భారత్ జట్టు ఫీల్డింగ్ అనంతరం ఫుట్‌బాల్ రిక్రియేషన్ గేమ్ ఆడుతూ సరదాగా గడిపారు.