న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోడ్డుపై భద్రంగా ఉండాలంటూ క్రికెట్ మ్యాచ్

Horn Not Ok Please T20 Cup: India cricketers to play exhibition match at Wankhede Stadium

హైదరాబాద్: రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సమాజాన్ని మేల్కొలిపే విధంగా క్రికెటర్లంతా కలిసి మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని గురించి ముందుగానే సునీల్ గవాస్కర్ ప్రకటించగా తాజాగా అజింకా రహానె తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. 'నాకు క్రికెట్‌లో స్లెడ్జింగ్ చేయడం ఇష్టముండదు. అలానే రోడ్డుపై హారన్ మోగించడం కూడా నచ్చదు. అని రోడ్డు భద్రతను సూచించేలా మాట్లాడాడు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ తో కలిసి టాటా గ్రూపు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా అవగాహన శిబిరం గురించి చర్చించాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నియంత్రించాలని పిలుపునిచ్చాడు. దీనిని అనవసరంగా హారన్ మోగించకుండా ఉండటం ద్వారా అదుపుచేయవచ్చని తెలిపాడు.

ఇందులో భాగంగానే క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ను రోడ్డుపై హారన్ మోగించడాన్ని పోల్చి చెప్పాడు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అయిన అజింకా రహానె ముంబై లోకల్‌గా మరింత శ్రద్ధ కనబరుస్తానంటూ.. ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

'హారన్ నాట్ ఓకే ప్లీజ్' హారన్ మోగించకండి అంటూ జరిగే ఈ టీ20 మ్యాచ్‌లో అజింకా రహానెతో పాటు, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన, సురేశ్ రైనా ఆడనున్నారు. ఈ మ్యాచ్‌కు మొత్తం రెండు జట్లు ఆడుతుండగా రోడ్ సేఫ్టీ 11, నో హాంకింగ్ 11 జట్లలో ప్రధాన క్రికెటర్లతో పాటు లోకల్ క్రికెటర్లు వారితో జతపడనున్నారు.

Story first published: Friday, March 23, 2018, 12:47 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X