న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త మైదానంలో రాజస్థాన్‌తో మ్యాచ్: చెన్నైకి కలిసొచ్చేనా?

By Nageshwara Rao
Hoping to see Dhoni and Raina in action today in the all new Pune

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం ఆతిథ్యమిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈ రెండు జట్లు ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

కావేరీ జల వివాదం కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను పూణెకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త మైదానంలో సత్తా చాటాలని చెన్నై ఊవిళ్లూరుతోంది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడగా రెండింటిలో విజయం సాధించిన ఒక దానిలో ఓటమి పాలైంది.

మరోవైపు హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన రాజస్థాన్‌ తర్వాతి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అనంతరం సొంతగడ్డపై కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే...

టోర్నీ ఆరంభం నుంచి సమష్టిగా రాణిస్తోన్న చెన్నై

టోర్నీ ఆరంభం నుంచి సమష్టిగా రాణిస్తోన్న చెన్నై

టోర్నీ ఆరంభం నుంచి చెన్నై సమష్టిగా రాణిస్తుంది. అయితే ఆ జ్టటుని గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. తొలి మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా, రెండో మ్యాచ్‌లో సురేశ్ రైనా గాయపడ్డాడు. దీంతో రైనాకు పది రోజుల విశ్రాంతి అవసరమని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది.

 వెన్నునొప్పితో బాధపడుతోన్న ధోని

వెన్నునొప్పితో బాధపడుతోన్న ధోని

ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరూ తుది జట్టులో ఉంటారా లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే శుక్రవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ పాల్గొన్నారు. వీరితో పాటు డుప్లెసిస్ కూడా రాజస్థాన్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటే చెన్నై బ్యాటింగ్ పటిష్టంగా ఉన్నట్లే.

 చెన్నై బౌలింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన పనిలేదు

చెన్నై బౌలింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన పనిలేదు

వీరికి తోడు షేన్ వాట్సన్‌, డ్వే బ్రావో, అంబటి రాయుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక చెన్నై బౌలింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ పుణె పిచ్‌పై అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడు. అతనికి తోడు వాట్సన్, శార్దూల్ ఠాకూర్‌ రెచ్చిపోతే రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు. అనుభవం కలిగిన హర్భజన్, జడేజా సత్తా చాటితే చెన్నై విజయం నల్లేరు మీద నడకే.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే నేతృత్వంలోని రాజస్థాన్ లీగ్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే నేతృత్వంలోని రాజస్థాన్ లీగ్

ఆరంభంలో నిరాశపర్చినా.. రెండు వరుస విజయాలతో జోరుని పెంచింది. కానీ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడటంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మిడిల్‌ ఆర్డర్‌లో సంజూ శాంసన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ గొప్పగా రాణించలేకపోతున్నారు.

బెన్‌ స్టోక్స్‌ నుంచి ఇప్పటివరకూ లేని మెరుపు ఇన్నింగ్స్‌

బెన్‌ స్టోక్స్‌ నుంచి ఇప్పటివరకూ లేని మెరుపు ఇన్నింగ్స్‌

జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసిన బెన్‌ స్టోక్స్‌ నుంచి ఇప్పటివరకూ మెరుపు ఇన్నింగ్స్‌ రాలేదు. బట్లర్‌ ఆడుతున్నా కీలక సమయంలో ఔట్‌ అవుతుండటం ప్రతికూలంగా మారింది. ఇక, కెప్టెన్ రహానే విలువైన పరుగులు జోడిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు.

స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఉనాద్కత్‌

స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఉనాద్కత్‌

మరోవైపు బౌలింగ్‌లో ఉనాద్కత్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ధావళ్‌ కులకర్ణి మాత్రమే ఉన్నంతలో మెరుగ్గా రాణిస్తున్నాడు. పేరున్న స్పిన్నర్లు లేకపోవడం కూడా రాజస్థాన్‌కు లోటే. అయితే యువ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. అయితే చెన్నైతో జరిగే మ్యాచ్‌లో పేసర్లు రాణిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు.

Story first published: Friday, April 20, 2018, 17:47 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X