పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సర్ఫరాజ్ స్పందన ఇదీ!

హైదరాబాద్: పాకిస్థాన్ టెస్టు, టీ20 జట్లకు కెప్టెన్లుగా ఎంపికైన అజహర్ అలీ, బాబర్ అజాంలకు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ శుభాకాంక్షలు తెలిపాడు. సర్ఫరాజ్ అహ్మద్ నేపథ్యంలోని పాకిస్థాన్ జట్టు ఈ మధ్య కాలంలో పేలవ ప్రదర్శన చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అతడిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు టెస్టుల్లో కెప్టెన్‌గా అజహర్ అలీని నియమించగా... టీ20లకు యువ బ్యాట్స్‌మెన్ బాబర్ అజాంను నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ "పాకిస్థాన్‌ను అత్యున్నత స్థాయిలో నడిపించడం గౌరవంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహాయం చేసిన నా సహచరులు, కోచ్‌లు మరియు సెలెక్టర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అజార్ అలీ, బాబర్ ఆజాంలకు నా శుభాకాంక్షలు. వీరి సారథ్యంలో పాకిస్థాన్ జట్టు మరింత బలంగా తయారవుతుందని నేను ఆశిస్తున్నాను" అని అన్నాడు.

సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై
మరోవైపు కెప్టెన్సీ నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై పాకిస్థాన్ ఛైర్మన్ ఇషాన్ మణి మాట్లాడుతూ "సర్ఫరాజ్ అహ్మద్ మనకు తెలిసిన ధైర్యమైన క్రికెటర్ మరియు పోరాట యోధుడు. అతడు మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు" అని అన్నాడు.

శ్రీలంక చేతిలో క్లీవ్ స్వీప్
ఇటీవలే స్వదేశంలో పెద్దగా అనుభవం లేని శ్రీలంక జట్టు చేతిలో పాకిస్థాన్ జట్టు క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సర్ఫరాజ్ బాధ్యత వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో సర్ఫరాజ్ కెప్టెన్సీపై పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.

2016లో టీ20 కెప్టెన్‌గా
ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్‌గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సైతం
సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టుకు 13 టెస్టులు, 48 వన్డేలు, 34 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహారించాడు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత సర్ఫరాజ్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ర్యాంకింగ్స్‌లో మరింతగా దిగజారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications