Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ మంచి పనికోసం: బ్యాగీ గ్రీన్ క్యాప్ వేలం వేయ‌నున్న ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌

Hope my baggy green can raise some significant funds: Shane Warne auctioning Test cap for bushfire victims

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ త‌న 'బ్యాగీ గ్రీన్ క్యాప్‌'ను వేలం వేయ‌నున్నాడు. అడవుల్లో రగిలిన కార్చిచ్చు ఆస్ట్రేలియాని గడగడలాడిస్తోంది. ఈ కార్చిచ్చులో 24మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... లక్షలాది వన్యప్రాణులను మంటల్లో దగ్ధం చేసింది. ఈ నేపథ్యంలో కార్చిచ్చు బాధితుల‌కు విరాళాం ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.

ఇందులో భాగంగా షేన్ వార్న్ కూడా తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని వారికి ఇవ్వనున్నట్లు చెప్పాడు. అడవుల్లో రగిలిన కార్చిచ్చు అంద‌ర్నీ నిరాశ‌కు లోను చేసింద‌ని... దావాన‌లం వ‌ల్ల వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. సుమారు 50 కోట్ల‌ జంతువులు చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు.

ఈ నేపథ్యంలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఉన్నామ‌ని, బాధితులకు సాయం చేస్తామ‌ని తెలిపాడు. "ఇది నా టెస్ట్ కెరీర్‌లో నేను ధరించిన నా ప్రియమైన బాగీ గ్రీన్ క్యాప్(350) ను వేలం వేయడానికి దారితీసింది. ప్రజలందరికీ సహాయపడటానికి నా బాగీ గ్రీన్ క్యాప్ కొంత నిధులను సేకరించగలదని నేను ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు.

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. కంగారూలకు ప్రసిద్ధి అయిన ఆస్ట్రేలియాలో ఇప్పుడు చనిపోయిన వీటి కళేబరాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. దీంతో కార్చిచ్చు బాధితులకు సాయం చేసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రెటీల సైతం తమ వంతుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అడవుల్లోని మంటలను అదుపు చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 3,000 మంది సైనికులను రంగంలో దింపింది.

న్యూసౌత్ వేల్స్. న్యూ సౌత్‌‌ వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూసౌత్‌ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం కొంతసేపు వర్షం పడటంతో మంటలు కాస్త చల్లారాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఈ టోర్నీ కోసం దేశానికి వచ్చిన పలువురు అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాళ్ళు సైతం నిధులు సేకరించారు.

బ్రిస్బేన్‌ టెన్నిస్‌ టోర్నీ ఆడటం ద్వారా తనకు రానున్న మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకే అందజేస్తానని ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన 23 ఏళ్ల యాష్లే బార్టీ గత నవంబర్‌లో రాయల్‌ సొసైటీకి 30 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అందజేశానని తెలిపింది. తాజాగా ఆస్ట్రేలియా అడవుల్లో రగిలిన కార్చిచ్చు నిరాశ్రయులైన బాధితుల కోసం రెడ్‌క్రాస్‌కు మరింత ఎక్కువగా విరాళమివ్వాలని నిర్ణయించుకుంది.

Story first published: Monday, January 6, 2020, 15:12 [IST]
Other articles published on Jan 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+