కేఎల్ రాహుల్ డ్యూయల్ రోల్‌పై దాదా: తొలి టీ20లో పంత్‌కు చోటు దక్కకపోవడంపై!

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్ కాంబినేషన్‌కు సంబంధించి భారత జట్టులోని అన్ని సమస్యలకు అకస్మాత్తుగా కేఎల్ రాహుల్ రూపంలో పరిష్కారం లభించింది. ప్రస్తుత భారత జట్టులో కేఎల్ రాహుల్ డ్యూయల్ రోల్స్ పోషించడంతో మనీష్ పాండే రూపంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించేందుకు కోహ్లీకి ఓ మంచి అవకాశం లభించింది.
ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ప్రదర్శన అటు కెప్టెన్ కోహ్లీతో పాటు ఇటు జట్టు యాజమాన్యాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా గాయం నుంచి రిషబ్ పంత్ కోలుకున్నప్పటికీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అతడికి చోటు దక్కలేదు. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్ గాయ పడటంతో కాంకషన్ కింద కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా రాణించాడు.

వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్
అయితే, వికెట్ కీపర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని కేఎల్ రాహుల్ అందిపుచ్చుకోవడంతో రెగ్యులర్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్‌కు భారత జట్టులో చోటు దక్కడం కష్టమైంది. కేఎల్ రాహుల్ సైతం ప్రస్తుతానికి జట్టులో డ్యూయల్ రోల్‌ను తాను "ప్రేమిస్తున్నానని" రాహుల్ సైతం వన్డే సిరిస్ అనంతరం వెల్లడించాడు.

గంగూలీ సైతం ప్రశంసలు
తాజాగా, కేఎల్ రాహుల్ ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ప్రశంసలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతడు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం జట్టు మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతి పాత్రను రాహుల్ సమర్థంగా పోషిస్తున్నాడని అన్నాడు.

తొలి టీ20లో పంత్‌కు దక్కని చోటు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడంపై గంగూలీ మట్లాడుతూ "విరాట్ కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ పాత్రను జట్టు మేనేజ్‌మెంట్, కెప్టెన్ నిర్ణయిస్తారు. వన్డేలు, టీ20ల్లో కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడు" అని తెలిపాడు.

అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని
"టెస్ట్ క్రికెట్‌ను సైతం బాగా ఆరంభించినప్పటికీ కొంచెం తగ్గాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో కూడా అతడు ఇలాగే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను. నేను ముందే చెప్పినట్టు ఈ నిర్ణయాలన్నీ జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంటుంది" అని గంగూలీ అన్నాడు.

వికెట్ కీపింగ్ రేసులో ఎవరుంటారు!
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో వికెట్ కీపింగ్ రేసులో ఎవరుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు గాను దాదా "దానిపై సెలక్టర్లు, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి నిర్ణయం తీసుకుంటారు. వారు ఏమి ఆలోచిస్తే అదే జరుగుతుంది" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరిస్‌లో ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications