Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

200: మరో మైలురాయిని అందుకున్న కెప్టెన్ డివిలియర్స్

బార్బడోస్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన క్రీడా జీవితంలో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ముక్కోణపు సిరిస్‌లో భాగంగా ఆదివారం బార్బడోస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరుపున 200 వన్డే మ్యాచ్‌‌‌లు ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.

ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతక ముందు వరకు దక్షిణాఫ్రికా తరుపున 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో జాక్వస్ కల్లిస్, గిబ్బ్, జాంటీ రోడ్స్, మార్క్ బౌచర్, షాన్ పొలాక్‌లు మాత్రమే ఉన్నారు. అయితే డివిలియర్స్ 200వ వన్డే మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడం విశేషం.

viliors

ఆదివారం బార్బడోస్‌లోని ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగిన సమయంలో ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశారు. అనంతరం భారీ వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఎంతకీ విరామం ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంఫైర్లు ప్రకటించారు.

అయితే డివిలియర్స్ క్రీడా జీవితంలో మైలు రాళ్లుగా నిలిచే మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గత నవంబర్‌లో భారత్‌తో టెస్టు సిరిస్ సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో డివిలియర్స్ 100 టెస్టులనూ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. కాగా దక్షిణాఫ్రికా తరుపున ఇప్పటివరకూ డివిలియర్స్ 106 టెస్టులు ఆడగా, 205 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో ఐదు వన్డేలు మాత్రం ఆఫ్రికా ఎలెవన్ తరపున డివిలియర్స్ ఆడాడు. కాగా దేశం తరుపున 200 వన్డేలు ఆడటం పట్ల డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ అనంతరం డివిలియర్స్ మాట్లాడుతూ ఇది తనకు లభించిన అరుదైన గౌరంగా భావిస్తున్నానని అన్నాడు. ఇలాంటి మైలు రాళ్లను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. నిజంగా ఇది మైలురాయేనని చెప్పిన డివిలియర్స్ తన క్రీడా జీవితం ఇంతకాలం సాగినందుకు సంతోషంగా ఉందన్నాడు.

ఏబీ డివిలియర్స్ ఓ క్రికెటర్ మాత్రమే కాదు. అతను ఓ మల్టీ టాలెంటెడ్. ఏబీ డివిలియర్స్ గురించి చాలా మందికి తెలియని విషయాలు మీకోసం ప్రత్యేకం:

* దక్షిణాఫ్రికా తరుపున జూనియర్ నేషనల్ హాకీ జట్టులో గోల్ కీపర్‌గా ఆడాడు.
* దక్షిణాఫ్రికా తరుపున జూనియర్ నేషనల్ పుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు
* దక్షిణాఫ్రికా జూనియర్ రగ్భీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు
* దక్షిణాఫ్రికాలో ఆరు పాఠశాలల స్విమ్మింగ్ రికార్డులను కలిగి ఉన్నాడు
* 100 మీటర్ల పరుగు పందెంలో జూనియర్ అథ్లెటిక్స్‌ విభాగంలో అత్యంత వేగవంతమైన రికార్డు
* దక్షిణాఫ్రికా జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో మెంబర్
* దక్షిణాఫ్రికా నేషనల్ బ్యాడ్మింటన్ అండర్-19 ఛాంపియన్
* అండర్ - 19 గోల్ఫ్ టోర్నమెంట్ విజేత
* దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్‌లో కేన్సర్ ఆసుపత్రిని నెలకొల్పాడు.
* జింబాబ్వేలో ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాభివృద్ధి తోడ్పాటుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+