Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి ఓవర్లో 4సిక్సులతో రెచ్చిపోయిన ఖుష్ దిల్.. ఒత్తిడికి చిత్తయిన హాంకాంగ్ బౌలర్లు.. గెలుపు దిశగా పాక్

 Hongkong vs Pakistan : Khusdil Hit 4 Sixes In Final Over Makes Pak to Score 193

సూపర్ 4 బెర్త్ కోసం పాక్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరుగుతున్న నేటి నాకౌట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు మహమ్మద్ రిజ్వాన్ (57బంతుల్లో 78పరుగులు 6ఫోర్లు 1సిక్సర్ నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్, ఫాకర్ జమాన్ (53పరుగులు 41బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో ఖుష్ దిల్ (35పరుగులు 15బంతుల్లో 5సిక్సర్లు నాటౌట్) వీర విహారం చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 193పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక చివరి ఓవర్లో ఖుష్ దిల్ నాలుగు భారీ సిక్సర్లు బాదడంతో పాటు.. వైడ్ ప్లస్ ఫోర్ రావడంతో ఆ ఓవర్లో 29పరుగులు వచ్చాయి. తద్వారా పాకిస్థాన్ తరఫున టీ20ల్లో ఒకే ఓవర్లో 29పరుగులు రావడం ఇదే తొలిసారి. హాంకాంగ్ బౌలర్లలో ఎహ్‌సాన్ ఖాన్ ఒక్కడే 2వికెట్లు తీశాడు.

యూఏఈలోని షార్జా స్టేడియంలో జరుగుతున్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ (9పరుగులు 8బంతుల్లో 1ఫోర్) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇక తర్వాత రిజ్వాన్, ఫాఖర్ జమాన్ ఇద్దరు బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరి బ్యాటింగ్ టెస్టును తలపించింది. కొన్ని స్టంపౌట్లు, కొన్ని ఎల్బీడబ్ల్యూలు మిస్సయ్యాయి. వీరిద్దరు 10ఓవర్లు ముగిసేసరికి స్కోరు బోర్డును 63పరుగులకు చేర్చారు. ఇక అక్కడి నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఇకపోతే చివర్లో హాంకాంగ్ బౌలర్లు సైతం ఒత్తిడికి లోనైయ్యారు. ఫలితంగా 18ఎక్స్ ట్రా పరుగులు వచ్చాయి. అలాగే చివర్లో ఖుష్ దిల్ హడలెత్తించే బ్యాటింగ్ చేయడంతో పాక్ స్కోరు 193కు చేరుకుంది. ఇక ఛేదనకు దిగిన హాంకాంగ్ చేతులెత్తేసేలా కన్పిస్తుంది. ఆ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. నిజాఖత్ ఖాన్ (2), ముర్తాజా (2), బాబర్ హయత్ (0) ఔటవ్వడంతో 19పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నషీమ్ షా 2, దహాన 1 వికెట్ తీశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి హాంకాంగ్ 3వికెట్లు కోల్పోయి 25పరుగులు చేసింది.

తుది జట్లు :
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ
హాంకాంగ్ (ప్లేయింగ్ XI): నిజాకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్ కెచ్నీ (వికెట్ కీపర్), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్

Story first published: Friday, September 2, 2022, 22:07 [IST]
Other articles published on Sep 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+