For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌కు షాకిస్తామంటున్న హాంకాంగ్.. పరువు కోసం ‘పాక్‌’లాట, టాస్ మిస్! అందుకే బౌలింగ్ ఎంచుకున్న HK

Hongkong vs Pakistan : HK Won the toss and elected Bowl First

యుఏఈలో ఆసియా కప్ 2022 టోర్నీ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే భారత జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 4 బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక ఇవాళ పాక్ వర్సెస్ హాంకాంగ్ మధ్య నాకౌట్ మ్యాచ్ జరగనుంది. బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతుంది.

ఇక అండర్ డాగ్‌గా బరిలోకి దిగుతున్న హాంకాంగ్‌‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక పాకిస్థాన్‌కు షాకిచ్చే స్థాయిలో ఆ జట్టు ఆట మెరుగుపడింది. అందువల్ల ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కన్పిస్తుంది.

పాక్ ఓడిపోతే ఆసియా కప్ టోర్నీకే..

ఇకపోతే యూఏఈలోని షార్జా స్టేడియంలో మ్యాచ్ షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం- సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. పొరపాటున గానీ హాంకాంగ్‌పై పాక్ ఓడిపోతే ఆ జట్టు పరువు పోవడమే కాకుండా ఆసియాకప్ వన్నె పూర్తిగా మసకబారే వీలుంది. ఎందుకంటే పాక్ గెలిస్తే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు మరో రెండు జరిగే వీలుంటుంది. ఓడితే మాత్రం పాక్ ఇంటిబాట పట్టడంతో టోర్నీ ప్రభ కాస్త తగ్గుతుంది. హాంకాంగ్ తన తొలి మ్యాచ్‌లో బలమైన భారత జట్టును తీవ్రంగా ప్రతిఘటించింది. భారత బౌలింగ్‌కు ధీటుగా స్పందించింది. 20ఓవర్లల్లో 152పరుగులు చేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే భారత బౌలింగ్లో కేవలం 147పరుగులు మాత్రమే చేసిన పాక్ కంటే హాంకాంగ్ కాస్త గట్టిగానే కన్పిస్తోంది.

మా దగ్గర సరైన ప్లాన్లు ఉన్నాయి.. అందుకే బౌలింగ్

ఇక ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు బాబర్, నిజాఖత్ ఖాన్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన నిజాఖత్ ఖాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నిజాకత్ ఖాన్ మాట్లాడుతూ.. మేము మళ్లీ బౌలింగ్ ఎంచుకోవాలనుకుంటున్నాం. ఛేజింగ్‌లో మేం రాణిస్తాం. మాకు ఈ రోజు కొన్ని కొత్త ప్లాన్లు ఉన్నాయి. తప్పకుండా మా ప్లేయర్లందరు మా ప్లాన్లను సరిగ్గా ఎక్సిక్యూట్ చేస్తారనకుంటున్నా. నేను ఖచ్చితంగా చెప్పేదేంటంటే ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్‌కు తప్పకుండా గట్టి షాకిస్తామనుకుంటున్నా. ఇక గత మ్యాచ్‌లో ఆడిన టీంతోనే ఈ మ్యాచ్ ఆడబోతున్నాం.

కవర్ చేసుకున్న బాబర్ ఆజామ్

ఇక టాస్ ఓడిన బాబర్ ఆజం మాట్లాడుతూ కాస్త కవర్ చేసుకున్నాడు. తాము టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లమంటూ పేర్కొన్నాడు. ముందు స్కోరుబోర్డుపైనా భారీ స్కోరు ఉంచి తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయాలనుకున్నాం. అదే మా ప్లాన్. మేం సేమ్ టీంతో బరిలోకి దిగబోతున్నాం. ప్రతి మ్యాచ్ మాకు కొత్త మ్యాచ్‌లా ఉంటుంది. కాబట్టి మేము మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాము. మా ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు.' అన్నాడు.

తుది జట్లు :

తుది జట్లు :

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ

హాంకాంగ్ (ప్లేయింగ్ XI): నిజాకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్ కెచ్నీ (వికెట్ కీపర్), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్

Story first published: Friday, September 2, 2022, 19:25 [IST]
Other articles published on Sep 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+