For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Hongkong : కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హాంకాంగ్ టీం.. తరానికి ఒక ప్లేయర్ అంటూ కితాబు

Hongkong Team Gave Their Official Jersey to Virat Kohli with Wonderful Note

టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్ కనబర్చుతూ జట్టుకు భారంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కప్ ద్వారా కోహ్లీ మళ్లీ ఫాం అందుకున్నాడు. మునుపటి కోహ్లీ అంత దూకుడుగా ఆడకున్నా.. తనలోని క్లాస్ ప్లేయర్‌ను చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో కీలక పరుగులు చేసిన కోహ్లీ.. ఇంక ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు గట్టిగా పడితే మునుపటి కోహ్లీలా సెట్టయిపోతాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కీలక 35పరుగులు చేసినప్పటికీ.. కోహ్లీ కాస్త కాన్ఫిడెంట్‌గా కన్పించలేదు.. బ్యాట్‌కు బంతి సరిగా తాకలేదు.. చాలా సార్లు ఎడ్జ్ అవ్వడం చూశాం.

సూర్యతో కలిసి 98పరుగుల భాగస్వామ్యం

సూర్యతో కలిసి 98పరుగుల భాగస్వామ్యం

అయితే హాంగ్ కాంగ్‌తో అజేయ హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మంచి టచ్ ప్రదర్శించాడు. కుదురుకునే వరకు చాలా నెమ్మదిగా ఆడిన కోహ్లీ.. తర్వాత వేగం పెంచాడు. 3 కాన్ఫిండెంట్ సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. ఇకపోతే మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్)తో కలిసి విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) మూడో వికెట్‌కు అజేయంగా 98పరుగుల భాగస్వామ్యం జోడించి.. జట్టు స్కోరును 192పరుగులకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.

జెర్సీపైన కోహ్లీకి ప్రేమతో

ఇకపోతే హాంకాంగ్ టీంకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఆ టీం కెప్టెన్ ఇటీవల ఇంటర్వ్యూలో తాను విరాట్ కోహ్లీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని.. కోహ్లీ మునుపటి ఫామ్ అందుకుంటే చూడాలని ఉందని.. పేర్కొన్నాడు. ఇకపోతే ఆ జట్టు ప్రధాన పేసర్ ఎహ్సాన్ ఖాన్ సైతం తనకు కోహ్లీ అంటే అభిమానం అని.. క్రికెట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన కోహ్లీని తమ టీం మొత్తం ఆదరిస్తుందని చెప్పాడు. ఇక మ్యాచ్ అనంతరం.. కోహ్లీకి హాంకాంగ్ టీం తమ అధికారిక జెర్సీని గిఫ్ట్‌గా అందించింది. జెర్సీపై ఆ టీం మంచి కోట్ కూడా చేసింది. 'ఓ తరానికి ఇన్ స్పిరిషేన్ మీరు.. అందుకు ధన్యవాదాలు.. మీరు మున్ముందు మరింత గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాలని ప్రేమతో హాంకాంగ్ టీం' అంటూ జెర్సీపై పేర్కొంది. ఇక కోహ్లీ తన ఇన్ స్టా స్టోరీలో ఈ జెర్సీని పోస్టు చేసి ఇలాంటి మీ ఆదరాభిమానానికి నిజంగా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు. ఇక హాంకాంగ్ సైతం టీమిండియాపై మంచి పోరాటాన్ని కనబర్చిందనే చెప్పాలి.

విరాట్ బౌలింగ్ ప్రధాన ఆకర్షణగా

విరాట్ బౌలింగ్ ప్రధాన ఆకర్షణగా

ఇకపోతే ఈ మ్యాచ్‌లో కోహ్లీ బౌలింగ్ వేయడం ప్రధాన ఆకర్షణగా మారింది. 17వ ఓవర్ బౌలింగ్ చేసిన విరాట్ కేవలం 6పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ దారుణంగా విఫలమైన వేళ విరాట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక కొందరైతే కోహ్లీ మీడియం పేసర్ కాబట్టి సరిపోయింది.. ఫాస్ట్ బౌలర్ అయ్యుంటే ఎలా ఉంటుండేనో అంటూ అంచనాలు వేసేకున్నారు. ఏదేమైనా విరాట్ మునుపటి టచ్ అందుకోవడం టీమిండియాకు, అతని అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 31 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు. అంతేకాకుండా ప్రస్తుత ఆసియాకప్‌లో బెస్ట్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

బాబర్, కించిత్ పోరాడినా..

బాబర్, కించిత్ పోరాడినా..

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లకు 192 పరుగులు చేసింది. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) పోరాడినా ఆ పోరాటం సరిపోలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, September 1, 2022, 8:40 [IST]
Other articles published on Sep 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+