Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘కించిత్’ సిగ్గుపడకుండా స్టేడియంలో స్నేహితురాలికి సర్ ప్రైజ్ ప్రపోజల్ చేశాడు..!

Hongkong Player Kinchit Shah Surprised His girlfriend with Love Proposal After Match

హాంకాంగ్ ఆటగాడు కించిత్ షా బుధవారం భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌ అనంతరం తన లైఫ్‌లో చిరస్మరణీయ మూమెంట్ పొందాడు. ఈ ఆల్‌రౌండర్ తన స్నేహితురాలికి దుబాయ్ స్టేడియంలో బహిరంగంగా లవ్ ప్రపోజ్ చేశాడు. భారత్‌పై 30 పరుగులతో రాణించిన కించిత్ షా ప్రపోజ్ చేసే సమయంలో కెమెరాలు వారి జంటను పూర్తిగా ఫోకస్ చేశాయి. ఇకపోతే ఈ లవ్ ప్రపోజల్‌ను అతని గర్ల్ ఫ్రెండ్ కూడా యాక్సెప్ట్ చేసింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఈ లవ్ ప్రపోజల్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక హాంకాంగ్ టీంకు చెందిన కించిత్ సహచరులు కూడా వీరిద్దరికి కంగ్రాట్స్ చెప్పి ఉత్సాహపరిచారు.

ఇకపోతే 193పరుగుల లక్ష్య ఛేదనలో 26ఏళ్ల కించిత్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 28బంతుల్లో 30పరుగులు చేసి కాసేపు ప్రతిఘటించాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్‌లో అతను హిట్టింగ్ చేయాలని చూసి ఔటయ్యాడు. భారత సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రవి బిష్ణోయ్ అద్భుతంగా అతనిచ్చిన క్యాచ్ అందుకున్నాడు.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 పరుగులు) వీరవిహారం చేయడంతో పాటు కోహ్లీ (59) సమయోచిత ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా తొలుత 192పరుగులు చేసింది. అయితే ఛేదనలో హాంకాంగ్ 152పరుగులకే పరిమితమైంది. తద్వారా ఆ జట్టు 40పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఆ జట్టు భారత బౌలింగ్లో పాకిస్థాన్ కంటే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.

Story first published: Thursday, September 1, 2022, 11:49 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+