Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హాంగ్‌కాంగ్ జట్టు.. నిజాకత్ ఖాన్ అర్థ సెంచరీతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు పాతమ్ నిస్సంకా(68) హాఫ్ సెంచరీ సాయంతో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ ఓటమితో హాంగ్‌కాంగ్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ ఓ చెత్త రికార్డును కూడా నెలకొల్పింది.

గతంలో భారత్, ఆస్ట్రేలియా కూడా..
ఈ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్ చెత్త ఫీల్డింగ్ కూడా శ్రీలంకకు కలిసొచ్చింది. ఈ టోర్నీలో హాంగ్ కాంగ్ ఏకంగా 11 క్యాచ్‌లను నేలపాలు చేసింది.దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అధిక క్యాచ్‌లు వదిలిన జట్ల జాబితాలో చేరిపోయింది. ఈ అవాంఛనీయ రికార్డు గతంలో ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి జట్ల పేరిట ఉండేది. ఇప్పుడు ఈ క్లబ్‌లో హాంగ్‌కాంగ్ కూడా చేరింది.
భారత్: 2009లో మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు క్యాచ్‌లు జారవిడిచింది.
దక్షిణాఫ్రికా: 2017లో కేప్‌టౌన్‌లో శ్రీలంకపైనే ఈ చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా: 2024లో స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు వదిలేసింది.
ఆరు క్యాచ్‌లు వదిలిపెట్టిన ఈ 4 జట్లలో మూడు జట్లు శ్రీలంకతో ఆడినప్పుడు ఈ రికార్డును నమోదు చేయడం ఆశ్చర్యకరమైన విషయం. హాంగ్‌కాంగ్ ఫీల్డింగ్ బలహీనమని చెప్పవచ్చు. కానీ భారత్, దక్షిణాఫ్రికా వంటి జట్ల ఫీల్డింగ్ అంత బలహీనంగా ఉండదు. శ్రీలంక ఎదురుగా వచ్చినప్పుడు ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ లయ తప్పిపోతుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.