Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia cup 2022 : ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన హాంకాంగ్.. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్

Hong Kong Qualified for Asia Cup 2022 Main Tourney
చిత్తుగా ఓడిస్తేనే రోహిత్ సేనకు ఫైనల్‌ బెర్త్ *Cricket | Telugu Oneindia

నిజాకత్ ఖాన్ నేతృత్వంలోని హాంకాంగ్.. ఆసియా కప్ 2022 టోర్నీకి క్వాలిఫై అయింది. అల్ అమెరత్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హాంకాంగ్ టోర్నీలో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఆసియా కప్‌లో గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్‌తో పాటు హాంకాంగ్ చేరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 31న బుధవారం భారత్‌తో హాంకాంగ్ తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న షార్జాలో పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఆసియా కప్ క్వాలిఫయర్‌లో హాంకాంగ్ మూడు మ్యాచ్‌లు గెలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో సింగపూర్‌పై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. తర్వాత రెండో మ్యాచ్‌లో కువైట్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా యూఏఈని కూడా ఓడించి క్వాలిఫయర్‌గా నిలిచింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో యాసిమ్ ముర్తుజా హాఫ్ సెంచరీ చేయడం, బాబర్ హయత్ 26 బంతుల్లో 38* నాటౌట్‌గా రాణించడంతో హాంకాంగ్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 148పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. స్కిప్పర్ నిజాకత్ కూడా 39పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు బౌలింగ్లో హాంకాంగ్ ఆఫ్ స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్ 24పరుగులకు 4వికెట్లు పడగొట్టాడు. తద్వారా యూఏఈ 19.3 ఓవర్లలో 147పరుగులకే ఆలౌటైంది. ఇక యూఏఈ బ్యాటింగ్లో సీపీ రిజ్వాన్ (49), జవార్ ఫరీద్ (41) పరుగులు చేసినప్పటికీ.. ఆ జట్టు పరాజయ గాథ మారలేదు.

Story first published: Thursday, August 25, 2022, 10:12 [IST]
Other articles published on Aug 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+