భారత పేసర్ల విజయ రహస్యం వెల్లడించిన బౌలింగ్ కోచ్

హైదరాబాద్: నిజాయితీ, కమ్యూనికేషన్, హార్డ్ వర్కే భారత పేసర్ల విజయానికి కారణమని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. కోచింగ్ సిబ్బందితో కూడా బహిరంగ సంభాషణ భారత పేసర్ల విజయానికి కారణమని తెలిపాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో భారత బౌలింగ్ లైనప్‌పై భరత్ అరుణ్ అనేక విషయాలను పంచుకున్నాడు.
"పేసర్లు రాణించాలంటే వారి వేగం ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి. మేం దీనిపై దృష్టిసారించినప్పుడు ఫాస్ట్ బౌలర్లపై కొన్ని అంశాలు ప్రభావం చూపుతున్నాయని తెలుసుకున్నాం. అతిగా బౌలింగ్ చేయించడం ఒకటి. పనిభారం పర్యవేక్షణ లేదు. సరైన విశ్రాంతి లేదు. తక్కువగా బౌలింగ్ చేయించడం మరో కారణం. ఇవన్నీ పేసర్ల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి" అని అన్నాడు.

భారత జట్టులో మంచి వాతావరణం
"సపోర్టింగ్ స్టాఫ్ పేసర్ల మధ్య సంభాషణ ఉండాలి. బౌలర్ ఎప్పుడైన మనసు విప్పి తన ఆలోచనలు, భయాలు, నమ్మకాల గురించి చెబుతారో అప్పుడే అతడిని సహాయక సిబ్బంది బాగా చూసుకోగలుగుతారు" అని భరత్ అరుణ్ తెలిపాడు. భారత జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీకి ఈ సందర్భంగా భరత్ అరుణ్ థ్యాంక్స్ చెప్పారు.

నిజాయతీ చాలా ముఖ్యం
"ఇక్కడ, నిజాయతీ చాలా ముఖ్యం. సిడ్నీ టెస్టుకు ముందు ఇషాంత్ మా వద్దకొచ్చి ఆడలేనని చెప్పాడు. ఇబ్బందిగా ఉందని చెప్పాడు. అప్పుడు జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, కుల్దీప్‌తో బరిలోకి దిగాలని నిర్ణయించాం. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత బుమ్రా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, అతడు అలిసిపోయానని చెప్పాడు. దీంతో అతడికి విరామం ఇచ్చాం" అని భరత్ అరుణ్ చెప్పాడు.

గతేడాది సఫారీ పర్యటనతోనే
"ఆటగాళ్లకు ఇలాంటి స్వేచ్ఛనిచ్చిన కోహ్లీ, రవి శాస్త్రికి అభినందనలు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడు ఇచ్చిన ప్రేరణతో మిగతా పేసర్లు రాణిస్తున్నారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనతోనే భారత పేసర్ల దాడి ఆరంభమైంది" అని భరత్ అరుణ్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications