న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాశ్మీర్‌‌ను ఓ దేశంగా: భారత మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించిందన్న అఫ్రిది

Home Minister Rajnath Singh takes a jibe at Shahid Afridi’s comments

హైదరాబాద్: "దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నాం.. ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్ ఎందుకు" అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పాక్‌లో వివాదానికి దారి తీశాయి.

<strong>కాశ్మీర్‌ను ఒక దేశంగా విడిచిపెట్టేయండి: అఫ్రీది</strong>కాశ్మీర్‌ను ఒక దేశంగా విడిచిపెట్టేయండి: అఫ్రీది

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ "కాశ్మీర్‌ను వదిలేయండి.. ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూసుకోండి" అని పాక్ ప్రభుత్వాన్ని అఫ్రిది డిమాండ్ చేశాడు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని షాహిద్ అఫ్రిది విమర్శించాడు.

ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి

ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి

అక్కడి ప్రజలు చావకూడదు. ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి. అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు. అదెంతో ఘోరమైన పరిస్థితి. ఇది చాలా బాధాకరం. ఏ తెగ నుంచైనా.. ఏ మతమైనా ప్రాణాలు కోల్పోవడమనేది చిన్న విషయం కాదు. గతంలోనూ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ.. అక్కడ భారత్ అమలు చేస్తున్న విధానాన్ని అఫ్రిది విమర్శించిన సంగతి తెలిసిందే.

భారత మీడియా నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది

అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించిందని అన్నాడు. తన ట్విట్టర్‌లో "భారత మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది. నా దేశం పట్ల మక్కువగా ఉన్నా, కాశ్మీరీల పోరాటాల విలువ తెలుసు. మానవత్వాన్ని కాపాడాలి, వారు వారి హక్కులను పొందాలి" అని ట్వీట్ చేశాడు.

అఫ్రిది వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ

మరోవైపు అఫ్రిది వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడుతూ "అఫ్రిది నిజ‌మే చెప్పాడు అని, పాక్ త‌మ దేశాన్నే చూసుకోలేక‌పోతున్న‌ది, ఇక క‌శ్మీర్‌ను ఏం చూసుకుంటుంద‌ని రాజ్‌నాథ్ అన్నారు. క‌శ్మీర్‌లో భార‌త్‌కు చెందిన భూభాగం అని, ఎప్ప‌టికీ ఇక్క‌డే ఉంటుంది" అని అన్నాడు.

Story first published: Thursday, November 15, 2018, 16:26 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X