Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ఘన విజయం!

జపాన్‌లోని కాకామిగహారా వేదికగా జరుగుతున్న అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు మరోసారి లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసింది. సోమవారం జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో కెప్టెన్ కేతన్ కుష్వాహా మెరుపు దాడితో భారత్ 4-1 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియా జట్టును సులువుగా ఓడించింది. ఈ విజయంతో లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కేతన్ కుష్వాహా ముందుండి జట్టును నడిపించాడు. మ్యాచ్ 3వ, 36వ నిమిషాల్లో రెండు కీలక గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేతన్ కుష్వాహాతో పాటు వరిందర్ సింగ్(5వ నిమిషం), షారూఖ్ అలీ(54వ నిమిషం) చెరో గోల్ చేసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. కొరియా జట్టు తరఫున కెప్టెన్ యూన్ జెహ్యూక్ 21వ నిమిషంలో ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం పూల్-ఎ లో భారత్, కొరియా, జపాన్ జట్లు ఆరేసి పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. మెరుగైన గోల్ డిఫరెన్స్ కారణంగా భారత్ గ్రూప్ టాప్‌లో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో రెండు పూల్స్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. కొరియాపై సాధించిన ఈ భారీ విజయం భారత్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరిచింది.

Hockey U18 Asia Cup India Beats South Korea 4-1 to Top Pool A Standing Captain Ketan Kushwaha Double Strike

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి క్వార్టర్ ఐదో నిమిషానికే భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట 3వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రాహుల్ యాదవ్ పాస్ సాయంతో కెప్టెన్ కేతన్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 5వ నిమిషంలో గాజీ ఖాన్ అందించిన అద్భుతమైన పాస్‌ను వరిందర్ సింగ్ ఏమాత్రం తడబడకుండా గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. రెండో క్వార్టర్ లో కొరియా పుంజుకుని 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 2-1కి తగ్గించింది.

అయితే మూడు, నాల్గవ క్వార్టర్లలో భారత్ మళ్లీ ఆటపై పట్టు సాధించింది. 36వ నిమిషంలో కేతన్ కుష్వాహా వ్యక్తిగత రెండో గోల్ కొట్టి భారత్‌కు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసే సమయానికి (53వ నిమిషంలో) కొరియా గోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. భారత గోల్‌కీపర్ ఆయుష్ రజక్ అద్భుతమైన డిఫెన్స్‌తో దానిని అడ్డుకున్నాడు. ఆ మరుసటి నిమిషంలోనే భారత్ ఎదురుదాడికి దిగి, షారూఖ్ అలీ క్లాస్ షాట్‌తో నాల్గవ గోల్ కొట్టి 4-1తో భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. టీమిండియా తన తదుపరి పూల్-ఎ మ్యాచ్‌లో జూన్ 3న చైనీస్ తైపీతో తలపడనుంది.

Story first published: Tuesday, June 2, 2026, 10:14 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+