టీవీ యాడ్‌తో కోహ్లీ-అనుష్క శర్మపై సెటైర్లు (పిక్చర్స్)
ముంబై: ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (1) విఫలయ్యాడు. దీంతో కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికీ సామాజిక అనుసంధాన వేదికల్లో అనుష్క శర్మను టార్గెట్ చేస్తున్నారు. కోహ్లీ చేసిన ఒక్క పరుగు చూసేందుకు అనుష్క కోట్లు వెచ్చించి మెల్బోర్న్ వెళ్లారని, అది ప్రేమంటే అంటూ, అనుష్క గ్యాలరీలో ఉండగా కోహ్లీ క్రీజులో ఉండలేకపోయారని అభిమానులు సెటైర్లు వేశారు.
టీవీలో వస్తున్న ఓ యాడ్‌ను కూడా అభిమానులు వదల్లేదు. విరాట్ ఐ వాంట్ యు హియర్ ఇన్ ఫైవ్ మినట్స్ అంటూ ఓ యాడ్ వస్తోంది. దీనిని ఉపయోగించి కూడా సెటైర్ వేశారు.

అనుష్క శర్మ
ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా - భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న బాలీవుడ్ నటి అనుష్క శర్మ.

టీవీ యాడ్
టీవీలో వస్తున్న ఓ యాడ్‌ను కూడా అభిమానులు వదల్లేదు. విరాట్ ఐ వాంట్ యు హియర్ ఇన్ ఫైవ్ మినట్స్ అంటూ ఓ యాడ్ వస్తోంది. దీనిని ఉపయోగించి కూడా సెటైర్ వేశారు.

కోహ్లీ - అనుష్క
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, ఆయన ప్రేయసి అనుష్క శర్మ చేతిలో చేయి వేసుకుని ముంబై విమానాశ్రయంలో కనిపించారు.

కోహ్లీ - అనుష్క
ఆస్ట్రేలియాపై ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రేమ జంట తిరిగి వచ్చింది. వారు సాధారణమైన దుస్తుల్లో పరస్పరం చేతులు పట్టుకుని కనిపించారు.

కోహ్లీ
విరాట్ కోహ్లీ వైఫల్యానికి క్రికెట్ అభిమానులు అనుష్క శర్మను దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో విరాట్ కోహ్లీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భరోసా ఇస్తున్నట్లుగా అనుష్క శర్మ చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications