Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాయర్ 303 నాటౌట్: ఇంగ్లాండ్ జట్టు ఇలా (ఫోటోలు)

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా రికార్డుల మోత మోగించింది. తన కెరీర్‌లో ఆడుతున్న మూడో టెస్టు సిరిస్‌లోనే టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్‌ నాయర్‌ (381 బంతుల్లో 303 నాటౌట్‌; 32 ఫోర్లు, 4 సిక్సర్లు)తో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కే సాధ్యం కాని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కరు సాధించిన అరుదైన ట్రిపుల్ సెంచరీ రికార్డుని యువ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత క్రికెటర్‌.

ఈ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు అయిన మొహాలి టెస్టులో కరుణ్ నాయర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో కూడా ఆడాడు. అయితే ఈ రెండు టెస్టుల్లో అతడి చేసిన పరుగులు 4, 13 మాత్రమే. ఈ స్థితిలో ఎవరైనా ఈ ఆటగాడి గురించి ఎక్కువగా ఊహిస్తారా?

అయితే ఎవరి అంచనాలకు అందకుండా కర్ణాటకకు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చెన్నై టెస్టులో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు తన సత్తా ఏంటో చూపించాడు. కుటుంబ సభ్యలు సమక్షంలో ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు.

ముఖ్యంగా డబుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్ 75 బంతుల్లోనే తన చివరి 103 పరుగులను సాధించడం విశేషం. అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే తను 245 బంతుల్లోనే 232 పరుగులు సాధించడం అతని జోరును సూచిస్తోంది. నాయర్ మారథాన్ ఇన్నింగ్స్‌కు తోడు అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత జట్టు టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును సాధించింది.

ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్‌కు ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. మరోవైపు మైదానంలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీ వీరుడికి కంగ్రాట్స్ ఇలా తెలిపారు.

నాయర్ ట్రిపుల్ సెంచరీ

నాయర్ ట్రిపుల్ సెంచరీ

చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన అనంతరం అభివాదం చేస్తున్న కరుణ్ నాయర్. టెస్టుల్లో తొలిసెంచరీ సాధించిన సమయంలోనూ భావోద్వేగాలు ప్రదర్శించిన కరుణ్ నాయర్ డబుల్, ట్రిపుల్ మార్క్ చేరినా సాదాసీదా అభివాదంతో సరిపెట్టాడు.

నాయర్‌కు ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ అభినందన

నాయర్‌కు ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ అభినందన

ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్‌ను ఇంగ్లాండ్ ఆటగాడు మెయిన్ అలీ అభినందిస్తున్న ఫోటో. చెన్నైలోని చెపాక్‌లో ఉన్న చిదంబరం స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగో రోజు ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

సెహ్వాగ్ తర్వాత రెండో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు

సెహ్వాగ్ తర్వాత రెండో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు

తన కెరీర్‌లో ఆడుతున్న మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచ‌రీనే ట్రిపుల్ సెంచరీగా మ‌ల‌చిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నాయర్ చరిత్ర సృష్టించాడు.

నాయర్‌ను అభినందిస్తున్న జో రూట్

నాయర్‌ను అభినందిస్తున్న జో రూట్

ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం నాయర్‌ను అభినందిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్‌ 6, 1991న కరుణ్‌ నాయర్‌ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్‌-15 క్రికెట్‌ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్‌ 19 జట్టులో చోటు సాధించాడు.

నాయర్‌ను అభినందిస్తున్న అలెస్టర్ కుక్

నాయర్‌ను అభినందిస్తున్న అలెస్టర్ కుక్

ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం నాయర్‌ను అభినందిస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్. టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్ (365 నాటౌట్‌), బాబ్ సింప్సన్ (311)ల తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో క్రికెటర్ నాయర్.

ట్రిపుల్ సెంచరీ వీరుడికి టీమిండియా అభినందన

ట్రిపుల్ సెంచరీ వీరుడికి టీమిండియా అభినందన

ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజున కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్‌కు టీమిండియా క్రికెటర్లు లేచి నిల్చుని అభివాదం తెలుపుతున్న దృశ్యం. ట్రిపుల్ సెంచరీ అనంతరం టీమిండియా 759 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+