Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు: రూ. 200 నోటుపై రోహిత్ శర్మ

Hit Man Rohit records third double-ton in ODIs, how twitter reacts

హైదరాబాద్: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ డబుల్ సెంచరీ రోహిత్ శర్మకు వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. రోహిత్ శర్మ డబుల్ సెంచరీని ట్విట్టర్‌లో అభిమానులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు.

రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువీలాంటి క్రికెటర్లతోపాటు ఐసీసీ, బీసీసీఐ మూడో డబుల్ సెంచరీ చేసిన రోహిత్‌ని అభినందించగా... నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో కాస్తంత వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు.

ఒకరు కొత్తగా వచ్చిన 200 నోటుపై రోహిత్ ఫొటోను ఉంచగా.. మరొకరు అనుష్క శర్మ సౌభాగ్యవతి అయితే.. రోహిత్‌శర్మ భార్య రితిక దోసౌభాగ్యవతి అయిందంటూ కామెంట్స్ పోస్టు చేశారు. గవాస్కర్ సింగిల్స్‌ను రెండుగా మారిస్తే.. రోహిత్ సెంచరీలను డబుల్ సెంచరీలుగా మారుస్తాడని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.... అతను ఇంపోర్టెడ్ మష్‌రూమ్స్ తింటాడని మరొ నెటిజన్ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, December 13, 2017, 18:28 [IST]
Other articles published on Dec 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+