Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌పై పాక్ మెరుగైన రికార్డు: కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా?

హైదరాబాద్: జూన్ 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఇంతవరకూ ఓడిపోలేదు. ఇప్పటి వరకూ వన్డే వరల్డ్ కప్‌లలో 6-0తో, ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో 5-0తో పాకిస్థాన్‌పై టీమిండియా పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

అయితే ఛాంఫియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌పై పాక్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా... పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్ 2-1తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది. కాగా, జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంఫియన్స్ ట్రోఫీలో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జూన్ 4వ తేదీన తలపడనుంది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి విదేశీ గడ్డపై పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఈ క్రమంలో ధోని బాటలోనే కోహ్లీ కూడా టీమిండియాకు విజయాన్ని అందిస్తాడా? లేదా అనే విషయం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశం అయింది.

2004లో తొలి ఓటమి

2004లో తొలి ఓటమి

కెన్యాపై గెలిచినా, పాకిస్తాన్‌ చేతిలో ఓడటంతో భారత్‌ సెమీస్‌ చేరలేకపోయింది. ఎడ్జిబాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం రాహుల్ ద్రవిడ్(67) ఒక్కడే రాణించడంతో 50 ఓవర్లలో 200 పరుగులు చేసింది. షోయబ్ అక్తర్, నవీద్ ఉల్ హసన్ చెరో 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్ యూసఫ్ చెలరేగడంతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

2009లో కూడా పాక్‌దే విజయం

2009లో కూడా పాక్‌దే విజయం

2008లోనే పాకిస్తాన్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా టోర్నీ అక్కడ సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడం,

ఆపై వర్షంతో ఆసీస్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో సెమీస్‌ అవకాశాలు కోల్పోయింది. షోయబ్ మాలిక్ సెంచరీ(128), మహ్మద్ యూసఫ్ హాఫ్ సెంచరీ (87)లతో రాణించడంతో పాక్ 302 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ అర్ధసెంచరీ(76)తో రాణించాడు.

2015లో ఫలితాన్ని మార్చిన ధోని

2015లో ఫలితాన్ని మార్చిన ధోని

ధోని నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్‌లను వరుసగా ఓడించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో 165 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19.1 ఓవర్లలో 102 పరుగులు చేసిన భారత్ మరో 17 బంతులుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20-20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌పై 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది.

2017- కోహ్లీ నేతృత్వంలో టీమిండియా

2017- కోహ్లీ నేతృత్వంలో టీమిండియా

మిని వరల్డ్ కప్‌గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలైన భారత్-పాక్‌లు నాలుగో సారి తలపడుతున్నాయి. జూన్ 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. విదేశీ గడ్డపై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ టోర్నీ ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో 1-2తో పాకిస్తాన్‌పై ఉన్న గెలుపోటముల రికార్డును మెరుగు పరుచుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+