4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ సంచలనం

హైదరాబాద్: 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్, వెటరన్ పేసర్ లసిత్ మలింగ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను మరోసారి పునరావృతం చేశాడు. ఈసారి టీ20ల్లో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.
మలింగ దెబ్బకు చివరి టీ20లో శ్రీలంక 37 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు... సొంతగడ్డపై తన కెప్టెన్సీలో సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా అతను కాపాడుకోగలిగాడు. అంతర్జాతీయ టీ20ల్లో మలింగకు ఇది రెండో హ్యాట్రిక్ కాగా.. వన్డేల్లో మూడు సార్లు ఈ ఘనత సాధించి పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్(4 హ్యాట్రిక్‌లు; 2 టెస్టుల్లో, 2 వన్డేల్లో)ను అధిగమించాడు.

టాస్ గెలిచిన శ్రీలంక
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. గుణతిలక (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లు శాంట్నర్ (3/12), అస్టిల్ (3/28) ధాటికి మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది.

2 ఓవర్లలో కివీస్ 15 పరుగులు
అనంతరం లక్ష్య ఛేదనలో మొదటి 2 ఓవర్లలో కివీస్ 15 పరుగులు చేసింది. దీంతో కివీస్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, మూడో ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు ఇవ్వని మలింగ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 4 బంతుల్లో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్
ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ వేసి మరో పరుగు ఇచ్చిన మలింగ మ్యాచ్‌ను 4-1-6-5తో ముగించాడు. దీంతో న్యూజిలాండ్ 16 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. దీంతో 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మున్రో (12), శాంట్నర్ (16), కెప్టెన్ సౌథీ (28) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

తొలి రెండు టీ20లను
ఈ సిరిస్‌లో ఇప్పటికే తొలి రెండు టీ20లను న్యూజిలాండ్ గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీయడంతో అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ల సెంచరీ పూర్తి చేసిన తొలి బౌలర్‌గా లసిత్ మలింగ చరిత్ర సృష్టించాడు. కొలిన్ మున్రో వికెట్ తీయడం ద్వారా మలింగ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (99 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు)ని వెనక్కు నెట్టి మలింగ (76 మ్యాచ్‌ల్లో 104) అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు.

4 బంతుల్లో 4 వికెట్లు తీశాడిలా:
2.3: మున్రో (బి) మలింగ
2.4: రూథర్‌ఫోర్డ్ (ఎల్బీ) మలింగ- రివ్యూలోనూ అవుట్
2.5: గ్రాండ్‌హోమ్ (బి) మలింగ - హ్యాట్రిక్ పూర్తి
2.6: టేలర్ (ఎల్బీ) మలింగ

తొలి బంతికే ఔటైన రూథర్‌ఫోర్డ్
న్యూజిలాండ్ ప్లేయర్ హామిష్ రూథర్‌ఫోర్డ్ 2013లో ఇదే మైదానంలో తన చివరి టి20 మ్యాచ్ ఆడాడు. మూడో మ్యాచ్‌కు ముందు గుప్టిల్ గాయపడటంతో ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న అతడిని బుధవారమే జట్టులోకి ఎంపిక చేశా రు. అదే రోజు సాయంత్రం బయల్దేరి దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి బరిలోకి దిగిన రూథర్‌ఫోర్డ్ తొలి బంతికే ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications