Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే భారత మహిళల జట్టు కూడా అద్భుతాలు చేసింది. ఇంగ్లీష్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ ఇంగ్లండ్‌లో టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను గెలవడం ఇదే మొదటిసారి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఈ విజయం చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.

నాలుగో టీ20లో టీమిండియా విజయం
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టు ఇంగ్లాండ్‌పై 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే..టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో నాలుగో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. భారత బౌలర్ల దాటికి 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ 22 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు, శ్రీచరణి 2 వికెట్లు, అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

Historic Win Indian Women Seal First-Ever T20I Series Victory in England

భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(32), షఫాలీ వర్మ(31), జెమీమా రోడ్రిగ్స్(24*), హర్మన్ ప్రీత్ కౌర్(26) రాణించారు. ఈ మ్యాచ్ లో రాధా యాదవ్ కు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ లభించింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత మహిళల జట్టు టీ20 సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టీమిండియా మొదటి, రెండో మ్యాచ్‌లలో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు పైచేయి సాధించింది. నాలుగో మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో T20 మ్యాచ్ ఎప్పుడు?
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ జూలై 12, 2025న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఇటీవల పురుషుల టీమిండియా ఇంగ్లండ్‌ను రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఓడించి, చాలా సంవత్సరాల నిరీక్షణను ముగించి ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 4-1తో ముగించాలని భావిస్తోంది.

Story first published: Thursday, July 10, 2025, 11:15 [IST]
Other articles published on Jul 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+