Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్: వన్డే చరిత్రలో సంచలనం!

ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్‌కు మారుపేరుగా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా స్పిన్ బౌలింగ్‌తో చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 21(మంగళవారం)న బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తమ ఇన్నింగ్స్ లోని మొత్తం 50 ఓవర్లను కేవలం స్పిన్ బౌలర్ల చేత మాత్రమే వేయించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పూర్తి స్థాయి సభ్యదేశం ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించడం ఇదే మొదటిసారి.

సాహసోపేతమైన వ్యూహం వెనుక కారణాలు
తొలి వన్డేలో బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్(6 వికెట్లు) దెబ్బకు వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే కుప్పకూలిన నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోమ్, టీమ్ యాజమాన్యం వ్యూహాత్మకంగా ఆలోచించారు. రెండో వన్డేకు ఉపయోగించిన ఢాకా పిచ్ పూర్తిగా పొడిగా, పగుళ్లతో స్పిన్‌కు అత్యంత అనుకూలంగా ఉండటంతో పేస్ బౌలర్లను పక్కనపెట్టి ఆల్-స్పిన్ దాడికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇది కరేబియన్ క్రికెట్ సంప్రదాయానికి పూర్తి విరుద్ధమైన నిర్ణయమైనా.. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్టుగా తీసుకున్న సరైన నిర్ణయంగా నిరూపించబడింది.

Historic Spin Feat by West Indies in ODI

50 ఓవర్ల స్పిన్ మాయాజాలం

వెస్టిండీస్ జట్టు ఐదుగురు స్పిన్ బౌలర్లను (అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోటీ, అలిక్ అథనాజ్) ఉపయోగించింది. వీరిలో ప్రతి ఒక్కరూ తమ కోటా 10 ఓవర్లను పూర్తి చేశారు. ఈ సమష్టి దాడి బంగ్లాదేశ్ బ్యాటర్లనున తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.గుడకేశ్ మోటీ (3/65) ప్రధాన స్పిన్నర్‌గా మోటీ 3 కీలక వికెట్లు పడగొట్టి తన పాత్రను సమర్థంగా పోషించాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన అలిక్ అథనాజ్ (2/14) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్లలో కేవలం 14 పరుగులను మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టడం విశేషం.పవర్ ప్లేతో సహా కీలక సమయాల్లో అకీల్ హోసేన్ (2/41) రెండు వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌త్రూలు అందించాడు.ఈ ఐదుగురు స్పిన్నర్ల ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో రిషాద్ హొస్సేన్ 14 బంతుల్లో 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో బంగ్లా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

రెండు రికార్డులు బ్రేక్
50 ఓవర్ల స్పిన్ బౌలింగ్: వన్డే చరిత్రలో 50 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ వేసిన తొలి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అంతకుముందు శ్రీలంక 1996లో వెస్టిండీస్‌పై మూడు సార్లు 44 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసిన రికార్డును బద్దలు కొట్టింది.

అత్యధిక స్పిన్ ఓవర్లు: ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 50 ఓవర్లు, బంగ్లాదేశ్ 42 ఓవర్లు (ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక్కడే పేసర్) స్పిన్ బౌలింగ్ వేయడంతో, ఇరు జట్లు కలిపి మొత్తం 92 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసిన అరుదైన ప్రపంచ రికార్డును కూడా ఈ మ్యాచ్ నెలకొల్పింది. అంతకుముందు 78.2 ఓవర్ల రికార్డు ఉండేది.

ఉత్కంఠభరితమైన ముగింపు
214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ జట్టు కూడా చివరి బంతికి 213 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. కెప్టెన్ షాయ్ హోప్ (53 నాటౌట్) అద్భుతంగా రాణించినప్పటికీ, బంగ్లా స్పిన్నర్ల ధాటికి విండీస్ తడబడింది. దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ మరోసారి తన స్పిన్‌తో మాయ చేసి బంగ్లాదేశ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను 1-1తో సమం చేసి కీలకమైన విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Wednesday, October 22, 2025, 10:12 [IST]
Other articles published on Oct 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+