For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1009 రన్స్ ప్రణవ్ స్పందన, గతంలో వీరి పేరిట రికార్డ్‌లు

By Srinivas

ముంబై: ముంబై ఆటో డ్రైవర్ కొడుకు ప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. అతను 395 నిమిషాలు ఆడాడు. అతని పరుగుల్లో 129 ఫోర్లు, 59 సిక్స్‌లు ఉన్నాయి. ఇంటర్ స్కూల్ అండర్ 16 మ్యాచ్ సందర్భంగా ఇతను రికార్డ్ సృష్టించాడు.

ఇప్పటి వరకు ఎవరు కూడా 1000 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ను ఎక్కడా చేయలేదు. ప్రణవ్ ధనవడే చేశాడు. ప్రణవ్ ధనవాడే రన్ రేట్ 312.38గా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో టాప్ స్కోర్లు ఇలా ఉన్నాయి.

టెస్టుల్లో - బ్రయాన్ లారా (వెస్టిండీస్) - 400 పరుగులు నాటౌట్
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో - బ్రయాన్ లారా (వెస్టిండీస్) - 501 పరుగులు నాటౌట్
వన్డేల్లో - రోహిత్ శర్మ (భారత్) - 264 పరుగులు
లిస్ట్ ఏ (50 ఓవర్లు) - అలి బ్రోన్ (సర్రీ) - 268 పరుగులు
ట్వంటీ 20 ఇంటర్నేషనల్ - ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 156 పరుగులు
ట్వంటీ 20 - క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 175 నాటౌట్

Auto rickshaw driver's son scores a world record 1,009 runs: Highest individual scores in various forms of cricket

మైనర్ క్రికెట్లో ముంబైకి చెందిన పృథ్వి షా 2013-14 సీజన్లో 546 పరుగులు చేశాడు. ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ (498), అర్మాన్ జాఫర్ (498) పరుగులతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

తన అత్యద్భుత ఇన్నింగ్స్‌తో ప్రణవ్‌ ధనవాడే ప్రపంచ క్రికెట్‌లో అన్ని విభాగాల్లో ఉన్న బ్యాటింగ్‌ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. 1899లో ఆర్థర్‌ కొలిన్స్‌ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. ప్రణవ్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌తో 116 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

రికార్డ్‌లు బద్దలు కొట్టాలనుకున్నా: ప్రణవ్ ధనవాడే

తాను 350 పరుగులకు చేరుకోగానే గతంలో ఉన్న రికార్డులు బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నానని ప్రణవ్ ధనవాడే చెప్పాడు. సర్ఫరాజ్, అర్మాన్, పృథ్వీ రికార్డులను అతను ఇప్పుడు అధిగమించాడు. నేను రికార్డులు బద్దలు కొడతానని విశ్వాసంతో ఉన్నానని చెప్పాడు.

600 పరుగుల వద్ద ఉన్నప్పుడు వెయ్యి పరుగులు చేసేందుకు ప్రయత్నించాలని గట్టిగా అనుకొన్నానని చెప్పాడు. తన కొడుకు గ్రేట్ క్రికెటర్ అని, అతను తన సత్తాను ఇప్పుడు చూపించాడని ప్రణవ్ ధనవాడే తండ్రి ప్రశాంత్ అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+