ఆటో డ్రైవర్ కొడుకు: వేయి పరుగులు దంచేశాడు (వీడియో)
ముంబై: అమ్మో, ఆటో డ్రైవర్ కుమారుడు అనిపిస్తున్నాడు ప్రణవ్ ధన్‌వాడే. ఇప్పటికే ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రణవ్ ధన్‌వాడే ఏకంగా వేయి పరుగులు దంచేసి ఇంకా ఆడుతున్నాడు. చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి ఉదంతం కనీవినీ ఎరుగం.
అండర్ 16 ఇంటర్ స్కూల్ క్రికెట్ మ్యాచులో ప్రణవ్ 1000 పరుగులు చేశాడు. ఈ వార్త రాసే సమయానికి అతను 1002 పరుగులు చేసి ఇంకా ఆడుతున్నాడు. ఒక్క రోజులో 652 పరుగులు చేసి సోమవారంనాడే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ప్రణవ్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

ఇప్పటి వరకు రెప్రిజెంటేటివ్ క్రికెట్‌లో వేయి పరుగుల వ్యక్తిగత పరుగులు ఎవరూ సాధించలేదు. ఓ ఆటో డ్రైవర్ కుమారుడికి ఇది చారిత్రక సందర్భం. ప్రణవ్ శ్రీమతి కెసి గాంధీ హైస్కూల్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో 15 ఏళ్ల ముంబై కుర్రాడు ప్రణవ్ సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ముంబై స్కూల్ క్రికెటర్ ప్రణవ్ ధన్వాడే 199 బంతుల్లో 652 పరుగులు చేశాడు. 78 ఫోర్లు, 30 సిక్స్‌లతో చెలరేగి 116 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును తిరగరాశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications