అయోధ్య భూమి పూజపై పాక్‌ క్రికెటర్‌ ఏమన్నాడంటే?

అయోధ్య: బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించింది. భూమిపూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.

ఇదొక చారిత్రక ఘట్టం:

హిందువులకు ఇదొక చారిత్రక ఘట్టం అని, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని డానిష్‌ కనేరియా ట్వీట్‌ చేశాడు. 'శ్రీరాముడిలోని అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగిఉంది. చెడుపై మంచి గెలుస్తుందనడానికి అతనో సూచిక. రామ మందిరానికి భూమి పూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషించారు. ఆత్మ సంతృప్తికి ఇదో గొప్ప కార్యం' అని కనేరియా ట్వీట్‌లో పేర్కొన్నాడు. కనేరియా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.

 హిందువు అయినందునే:

హిందువు అయినందునే:

డానిష్‌ కనేరియా చాలా రోజుల నుంచి తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను వేడుకుంటున్నాడు. తాను హిందువు అయినందునే పీసీబీలో తనకు మద్దతు లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ ఉమర్ అక్మల్‌ విషయంలో పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదించిన నేపథ్యంలో మరోసారి తన బాధను వెల్లగక్కాడు. ''నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్‌, ఇతరుల మీద మాత్రం కాదు. జీవితకాల నిషేధం నా మీదే కానీ.. వేరేవాళ్లకు కాదు. కులం, మతం, వర్ణం, నేపథ్యం లాంటి విషయాలను బట్టి చట్టాలు అమలౌతాయా?. నేనొక హిందువును, ఈ విషయంలో గర్వంగా ఉన్నా' అని అన్నాడు.

కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌:

కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌:

2000లో పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు. ఇక 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

జీవనోపాధి లేక ఇబ్బందులు:

ఆటకు దూరమైనప్పటి నుంచీ జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని, కుటుంబ పోషన కోసం మళ్లీ క్రికెట్‌ ఆడాలనుందని, పీసీబీ చొరవ తీసుకొని అవకాశం కల్పించాలని డానిష్‌ కనేరియా పలుమార్లు కోరాడు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని పీసీబీ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డే అతడికి శిక్ష విధించిందని, అక్కడే సంప్రదించాలని పీసీబీ ఇటీవల కనేరియాకు సూచించింది. దీంతో కనేరియాకు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు. మాజీ క్రికెటర్‌ అనిల్‌ దల్పత్‌ తర్వాత కనేరియానే పాక్‌ జట్టులో ఆడిన రెండో హిందూ ఆటగాడు.

ఇంట్లోకి వరద నీరు.. సాయం కావాలంటూ వేడుకున్న యువరాజ్‌!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 6, 2020, 12:42 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X