
హైదరాబాద్: కావ్య కోణార్ 16 ఏళ్ల యువ క్రికెటర్. కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) నిర్వహించిన ఇంటర్-డిస్ట్రిక్ టోర్నీలో బుర్ద్వాన్ జిల్లా తరుపున బరిలోకి దిగిన 31 బంతుల్లో 85 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మైదానంలో తన బ్యాట్‌తో యుద్ధం చేసిన కావ్య మైదానం బయట కూడా యుద్ధం చేస్తోంది.
కావ్య తల్లిదండ్రులు సుబ్రత-సాస్వటి కేన్సర్‌తో పోరాడుతున్నారు. ఏడు సంవత్సరాల క్రితమే కావ్య తండ్రి సుబ్రత ఈ వ్యాధి బారిన పడగా... మూడు సంవత్సరాల క్రితం ఆమె తల్లి గొంతు కేన్సర్‌కు సంబంధించిన చికిత్స పొందుతుంది. ఈ బాధను దిగమింగుకుని తాను క్రికెట్ ఆడుతున్నానని కావ్య చెప్పడం విశేషం.
'మొదట్లో ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ట్రీట్‌మెంట్ కోసం నా తల్లిదండ్రులు ముంబైకి వెళ్లేవారు. ఈ సమయంలో నేను నా తాత వాళ్ల ఇంట్లో కొన్నాళ్లు... నా పెద్దన్నయ్య వాళ్ల ఇంట్లో మరికొన్నాళ్లు ఉండేదాన్ని. ఇప్పటికీ నేను నా తల్లిదండ్రులకు వచ్చిన వ్యాధి గురించి ఆలోచిస్తూనే ఉన్నా' అని చెప్పుకొచ్చింది.
'అయితే నా ఇంట్లోని పరిస్థితి తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటున్నా' అని ఇంటర్-డిస్ట్రిక్ టోర్నీలో 173 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని గెలుచుకున్న కావ్య తెలిపింది. కావ్య తల్లిదండ్రులు ట్రీట్‌మెంట్ నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్ కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రిలో నెలలు తరబడి ఉండేవారు.
'సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. నా క్రికెట్ వృద్ధి చెందడంలో వారే ప్రేరణగా నిలిచారు. అయితే నా తల్లిదండ్రులే నా బలం. ఎన్నో విషయాల్లో నాకు ప్రేరణగా నిలిచారు. కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ నన్ను క్రికెటర్‌గా ప్రోత్సహిస్తున్నారు' అని కావ్య తెలిపింది.
'విధి రాతను ఎవరూ తప్పించలేరు. క్రికెట్‌లో ఆఖరి బంతి వరకు జట్టు విజయం కోసం ఎలా అయితే తాపత్రయపడతామో... నా కుమార్తె కూడా క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనేది నా ఆశ' అని కావ్య తండ్రి సుబ్రత ఈ సందర్భంగా తెలిపారు. కాగా, కావ్య తల్లి స్కూల్ టీచర్ కాగా... తండ్రి మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెల్ చేస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.