పది కిలోల బ్యాట్, 2.5 కిలోల చేయి: చాహల్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ

హైదరాబాద్: చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చేసిన ఓ పోస్టుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్రోల్ చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆదివారం కటక్ వేదికగా ఆఖరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే కటక్‌కు చేరుకున్నాయి.
శనివారం ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కటక్ పిచ్‌ను పరిశీలిస్తోన్న సమయంలో అతడి బ్యాట్‌ను తీసుకుని యజువేంద్ర చాహల్ అప్పర్ కట్ కొడుతున్నట్లు స్టైల్ పెట్టాడు. ఈ ఫోటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "పది కిలోల బ్యాట్.. 2.5 కిలోల చేయి" అని కామెంట్ పెట్టాడు.
చాహల్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ
ఈ ఫోటోపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ "నీ తొడ.. పొలార్డ్ పిక్క అంత కూడా ఉండదు" అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ, యజవేంద్ర చాహల్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నారు.

సరదాగా ఆట పట్టిస్తూ
జట్టులోని సహచర ఆటగాళ్లను చాహల్ ఎప్పుడూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అంతేకాదు చాహల్ టీవీ పేరిట మ్యాచ్ అనంతరం ఇంటర్యూలో కూడా చేస్తుంటాడు. ఇదిలా ఉంటే, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చాహల్ తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. మొదటి రెండు వన్డేల్లో చాహల్‌కు చోటు దక్కలేదు.

కటక్ వేదికగా మూడో వన్డే
కాగా, ఆదివారం జరగనున్న మూడో వన్డే సిరిస్ విజేతను నిర్ణయించేది కావడంతో ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ నెగ్గడంలో సిరిస్ 1-1తో సమం అయింది. చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

సిరిస్ విజేతగా నిలిచేదెవరో?
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. మూడో వన్డేలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications